తన సినిమాల్లో గుడ్ టచ్ బాడ్ టచ్ గురించి క్లాసులు.. ఆడవాళ్ళ గొప్పతనం గురించి నీతులు వల్లించడం ఆ హీరోకి మాములు విషయం. కానీ నిజజీవితంలో మాత్రం తన సినిమాల్లో నటించే సహచర నటీమణులను ఆడవాళ్లను వేధించడం సదరు స్టార్ హీరోకి సాధారణ విషయం.. బహిరంగ వేదికల్లో ప్రజలంతా గమనిస్తారన్న స్పృహ లేకుండా ఆడవాళ్లు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి.. కడుపైనా చేయాలని స్టేట్మెంట్స్ పాస్ చేసి తన అభిమానులను రెచ్చగొట్టగలడు.. మరోవైపు తన దగ్గరకు వచ్చిన అభిమానులను పరిగెత్తించి కొట్టగలడు.. ఇన్ని చేస్తున్నా తమ అభిమాన హీరోది పసిపిల్లల మనస్తత్వం అంటూ వెనకేసుకురావడం ఆయన అభిమానులకే చెల్లింది.
తెలుగులో పలు సినిమాల్లో నటించిన రాధికా ఆప్టే గతంలో తనను ఓ అగ్రహీరో వేధించాడంటూ బాంబు పేల్చింది. అప్పటికే క్యాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాధికా ఆప్టేను వేధించిన హీరో ఎవరనే సందేహాలు సాధారణ ప్రజల్లో కూడా వ్యక్తమయ్యాయి. అందరి వేళ్ళూ ఓ వ్యక్తివైపే చూపించాయి. ఎందుకంటే రాధికా ఆప్టే సదరు అగ్ర హీరోతో కాకుండా వేరేవారితో నటించలేదు. కొంతకాలం చర్చ నడిచినా అగ్ర హీరో కావడంతో టాలీవుడ్ లో ఎవరూ నోరు మెదపలేదు.
అనంతరం తమిళ బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన విచిత్ర గతంలో తాను సినిమాల నుండి తప్పుకోవడానికి కారణం ఓ తెలుగు అగ్ర నటుడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. అర్ధరాత్రి తప్ప తాగి తన డోర్ కొట్టేవాడని భయంతో ఎన్నోరోజులు నిద్రలేని రాత్రులు గడిపానని ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఆమె నటించిన చివరి సినిమా సదరు హీరో సినిమానే కావడం ఆ తరువాత ఆమె సినిమాల్లో నటించకపోవడం గమనిస్తే మరోసారి అందరి అనుమానం ఆ అగ్ర హీరోపైనే కలిగింది. కానీ ఏ ఒక్కరూ ఈ విషయంపై ప్రశ్నించే సాహసం చేయలేదు. విచిత్ర తన పాపులారిటీ కోసం ఈ వ్యాఖ్యలు చేసిందన్న వారూ లేకపోలేదు.
తాజాగా వెన్నిరాడై నిర్మల ఆరోపణలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. 1960 – 70 దశకాల్లో అగ్రనటిగా చలామణి అయిన వెన్నిరాడై నిర్మలను కూడా అప్పట్లో అన్నదమ్ముల అనుబంధం సినిమా షూటింగ్ సమయంలో ఆ హీరోనే ఇబ్బంది పెట్టాడంటూ ఆరోపణలు చేయడం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో వెన్నిరాడై నిర్మల కంటే 13 ఏళ్ళు చిన్నవాడిగా ఉన్న ఆ హీరో ఆమెను వేధించే సాహసం చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి.? ఆడవారిపై ఆ హీరోకు ఉన్న చులకన భావం పలువురు బాధితులు పలు సందర్భాల్లో వెల్లడిస్తూనే ఉన్న ప్రతీసారి వెనకేసుకొచ్చే అభిమానులు ఇదే తరహాలో తమ కుటుంబ సభ్యులపై వేధింపులకు దిగితే ఇలానే వెనకేసుకొస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.. పసి పిల్లల మనస్తత్వం అంటూ సదరు హీరోని ఎంకరేజ్ చేస్తూ వస్తున్న అభిమానులని కూడా తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. సినిమాల్లో ఆడవారి గొప్పతనం గురించి వారిని ఎలా గౌరవించాలో చెప్పే సీన్లలో నటించే సదరు హీరో అదే గౌరవాన్ని బయట ఎందుకు ఇవ్వడం లేదన్నది ఆ హీరో అభిమానులు తమని తాము ప్రశ్నించుకోవాల్సిన అవసరం. అలాంటి హీరోని అందలం ఎక్కించడం మాని తప్పు చేసాడని రుజువైన ప్రతీసారి నిలదీస్తే ఇలాంటి వేధింపులకు పాల్పడే మరికొందరికి బుద్ది వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఎంకరేజ్ చేసారో అక్కడి వరకూ పరిమితమైన వేధింపులు మీ వరకూ రావొచ్చు.. అభిమానులు కాస్త మనసు పెట్టి ఆలోచించండి..