పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’గ్లింప్స్ ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో మరోసారి తన పైత్యం ఫ్యాన్స్ పై రుద్దే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేసాడు. సినిమా, రాజకీయం అంటూ నిలకడ లేకుండా రెండు పడవలపై కాళ్ళు పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ రెండింటిని కలగాపులగం చేస్తూ ఒకేలా ట్రీట్ చేయడంతోనే సమస్య మొదలైంది. ఎప్పుడైతే రాజకీయాల్లో కాలు పెట్టాడో అప్పటినుండి అవసరం ఉన్నా లేకున్నా పొలిటికల్ డైలాగ్స్ ని తన సినిమాల్లో ఇరికించే ప్రయత్నం పవన్ చేస్తూ వచ్చాడు. తాజాగా అదే పైత్యం ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ లో వదిలాడు.
గాజు పగిలేకొద్ది పదునెక్కిది. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అంటూ పొలిటికల్ టచ్ తో గ్లింప్స్ లో పవన్ చెప్పిన డైలాగ్స్ విని పవన్ కళ్యాణ్ ఇక మారడా అంటూ పవన్ ఫ్యాన్స్ వాపోతున్నారు. వాస్తవానికి అటు సినిమా ఇటు రాజకీయ పార్టీ రెండింటి మధ్య సమతూకం పాటించలేక పోవడం వల్ల అటు పూర్తిస్థాయి రాజకీయాలు చేయలేక, ఇటు వరుసగా సినిమాలు తీయలేక పవన్ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అందుకే వీకెండ్ పొలిటీషియన్ గా వీకెండ్ హీరోగా తన బండిని నెట్టుకొస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయ సభల్లో సినిమా డైలాగ్స్ కొట్టడం, సినిమాల్లో తన పార్టీకి సంబంధించిన రాజకీయ డైలాగ్స్ ఇరికిస్తూ కాలం గడుపుతున్నాడు. అవసరం లేకున్నా ఆయా పొలిటికల్ డైలాగ్స్ తన సినిమాల్లో ఇరికించడం పవన్ కి పరిపాటిగా మారింది.
పార్టీ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా టీడీపీకి ఊడిగం చేస్తూ తన పార్టీ గెలవకపోవడానికి కార్యకర్తలే కారణమని చెప్పుకొచ్చే పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రం సంబంధం లేకుండా గాజు గ్లాసుకి ఎలివేషన్స్ ఇచ్చుకోవడం చూసి ఆ పార్టీ కార్యకర్తలు అవాక్కవుతున్నారు. పార్టీని నిలబెట్టే ఛాన్స్ వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని అందుకోకుండా తక్కువ సీట్లకు తన పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టి ఇప్పుడేమో గాజు గ్లాసు తోపు అంటూ సినిమాలు తీసుకోవడం పవన్ కే చెల్లింది. ఇప్పటికే పవన్ దయవల్ల 24 అక్షరాల గాయత్రీ మంత్రం 21 అక్షరాలకు కుచించుకుపోయింది. దక్కిన మూడు ఎంపీ సీట్లు కాస్త రెండుకు దిగజారిపోయాయి. ఇవన్నీ పట్టించుకోకుండా సినిమాల్లో ఎలివేషన్స్ చూపిస్తూ రెండు మూడు డైలాగ్స్ వదిలి ఫ్యాన్స్ ని పండగ చేసుకోండి అన్నట్లు పవన్ చేస్తున్న డ్రామాలు చూసి జనసైనికులు అవాక్కవుతున్నారు. సినిమాల్లో ఎలివేషన్స్ కాదు మాకు కావాల్సింది. నిజ జీవితంలో పొలిటికల్ గా పార్టీని బలపరిచి ఇలాంటి ఎలివేషన్స్ ఇస్తే బాగుంటుందని జనసైనికులు కోరుకుంటున్నారు. మరి జనసైనికుల గోడు పవన్ ఆలకిస్తాడా అంటే అనుమానమే అని చెప్పాలి..