పేరుకు చెన్నై హైదరాబాద్ హైవే… కానీ అభివృద్ధి లో మాత్రం ఆమడ దూరం. కానీ ఈ ఐదు సంవత్సరాల లో అభివృద్ధి పథంలో ఠీవి గా నిల్చుంది. గత నలభై సంవత్సరాలుగా పిడుగురాళ్ల ని వేదిస్తున్న సమస్యలన్నిటికీ ఆపరేషన్ చేసి సెట్ చేసి పెట్టారు ఈ 5 సంవత్సరాల కాలంలో….
మొదటిది:
అతి పెద్ద సమస్య, పిడుగురాళ్ల టౌన్ లో ట్రాఫిక్ జామ్. ఉదయం ఎనిమిది దాటినప్పటి నుండి రాత్రి పది వరకూ పిడుగురాళ్ల మెయిన్ రోడ్ ట్రాఫిక్ జామ్ అయ్యే ఉంటుంది. ఇది గత పదిహేనేళ్లుగా నిత్యకృత్యం . ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్లు వెడల్పు చేసి, డబుల్ చేశారు, ఇప్పుడు రోడ్లు విశాలంగా ఉన్నాయి, ట్రాఫిక్ జామ్ సమస్యలు తగ్గాయి .
రెండోది:
పిడుగురాళ్ల బైపాస్ రోడ్…. ఎప్పుడో వైఎస్ఆర్ గారి హయాంలో మొదలయిన అద్దంకి నార్కట్ పల్లి హైవే మొత్తం కంప్లీట్ అయినా, మా బైపాస్ కి మాత్రం ఇప్పుడే ఈ ప్రభుత్వ హయాంలోనే 14 ఏళ్ల తర్వాత మోక్షం వచ్చింది
మూడవది:
మంచి నీరు… పిడుగురాళ్ల అంటే సున్నం రాయి, నాప రాయి… భూగర్భ నీళ్ళు చవ్వ గా ఉంటాయి, తాగలేము… చిన్నప్పుడు ఊరి చివర వున్న ప్రభుత్వ ఇంటర్ కాలేజి పంపు నుండి కానీ, కొండమోడు దర్గా నుండి కానీ సైకిల్ కి ఆటు ఇటు రెండు బిందలు వేసి తెచ్చుకొనేవల్లం త్రాగటానికి… కాల క్రమంలో కాన్ వాటర్ వచ్చాయి… ఇప్పుడు ఇంటి ఇంటికి కృష్ణ వాటర్ పైప్ లైన్ వేశారు.. ఈ పధకం కూడా వైఎస్ఆర్ గారు సాంక్షన్ చేసిందే, తర్వాతి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినా ఆయన కొడుకు జగన్, స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పుణ్యాన ఈ కల సాకారం అయ్యింది .
నాల్గవది:
ఏదైనా అత్యవసర వైద్యం అంటేనే, యాక్సిడెంట్ లాంటివి జరిగితేనో 70 కిలోమీటర్ల దూరం ఉన్న గుంటూరు పరిగెట్టాలి… ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మరియు వైద్యశాల… ఇది మాత్రం మా ఊహకి అందనిది… సదా కృతజ్ఞతలు జగన్ గారికి
ఐదవది: జానపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి….. రైల్వే గేట్ పడింది అంటే చాలు, కిలోమీటర్ ట్రాఫిక్ జామ్… మొన్ననే శంకు స్థాపన చేశారు…18 నెలల్లో పూర్తి చేస్తారు….
గత నాలుగు దశాబ్దాలలో ఎవరయన కులం, మతం తో సంబందం లేకుండా, ఊరి కోసం, పిడుగురాళ్ల కోసం ఇంత ఎవరైనా చేశారా… చేస్తే నా ఓటు వాళ్ళకే వేస్తాను… పైన చెప్పినవి నిజమో కాదో మీ మనః సాక్షిని అడగండి… ఇవ్వి అన్ని మాకు ఎందుకు, మాకు మా కులం ముఖ్యం, మతం ముఖ్యం, మొదటి నుండి మేము పలానా జెండా మోశాము కాబట్టి ఆ పార్టీకే ఓటు వేస్తాము అంటే వేసుకోండి, కానీ పిడుగురాళ్ల అభివృద్ధి కాలేదు అని మాత్రం అనకండి…..