పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలు మాత్రమే తీసుకున్నారు. దీనిపై అటు జనసైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కక్కలేక మింగలేక ఏడుస్తున్నారు. ఎవరైనా ఇలా జరిగిందేంటని అడిగితే అబ్బే మేము బాగున్నాం.. రాష్ట్రం కోసం త్యాగం చేశామని కవర్ చేసుకుంటున్నారు. 24ను 40కి పైగా స్థానాలుగా చూడాలన్న సేనాని వ్యాఖ్యలపై ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. ఇక పచ్చ గ్యాంగ్‌ను ఎప్పటికప్పుడు ఉతికి ఆరేసే సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అయితే సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించారు. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పడానికే పవన్ 24 సీట్లు తీసుకున్నాడనే మీమ్ షేర్ చేశారు. 23 సీట్లు ఇస్తే టీడీపీ లక్కీ నంబర్ అని, 25 ఇస్తే పావలాకి పావలా సీట్లని ట్రోల్ చేస్తారు. అందుకే మధ్యే మార్గంగా 24 సీట్లను సేనాని తీసుకున్నారని సెటైర్ వేశారు. మరో పోస్టులో నా జీవితంలో ఈరోజు పీకే గురించి ఫీలయ్యే దానికంటే, పీకే కంటే ఎక్కువగా నేను జనసేన గురించి బాధపడ్డానంటూ రాసుకొచ్చారు. ఇంకో ట్వీట్ లో
హేయ్ పవన్ 24 + 7 x 3 = 45 అయితే 151 + 7 x 22 = 303 అయితే వేర్ ఇస్ 175 ? ఈ లెక్కకేమైనా తిక్కుందా అని ప్రశ్నించారు. పవన్ టికెట్ ప్రకటన వీడియో పెట్టి ఈ మైండ్ బ్లోయింగ్ లాజిక్ రెౠ లక్షల పుస్తకాల నుంచి తీసుకోబడిందని రాశారు.
గతంలో కూడా ఆర్జీవీ అనేక సార్లు చంద్రబాబు నాయుడిపై సెటైర్లు వేశారు. బాబు లక్కీ నంబర్ 23 అంటూ ట్విట్టర్ (ఎక్స్)లో కొద్దిరోజుల క్రితం పోస్టు పెట్టారు. అందులో ఈ విధంగా రాసుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య 23. 2019లో ఆయన గెల్చుకున్న స్థానాలు 23. పోలీసులు అరెస్ట్ చేసిన తేదీని కూడితే 23. ఆయన ఖైదీ నంబర్ 7691. దీనిని కూడినా 23 వస్తుంది. ఎన్టీఆర్ నుంచి లాక్కున్న పార్టీకి వారసుడిగా చేద్దామనుకుంటున్న లోకేశ్ పుట్టిన తేదీ 23. ఇక తన వ్యూహం సినిమా రిలీజ్ తేదీ 23 అని చెప్పారు.
రామ్‌గోపాల్ వర్మ చాలాకాలంగా ఎల్లో గ్యాంగ్, జనసేనపై విరుచుకు పడుతున్నారు. లోకేశ్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ట్యాగ్ చేస్తూ సెటైరికల్ పోస్టులు పెడుతుంటారు. దీంతో వారి అభిమానగణానికి ఈయనంటే విపరీతమైన కోపం ఉంది. నిత్యం తిడుతూ ఉంటారు. ఒక్కోసారి హద్దులు దాటి బూతులు అంటుంటారు. అయితే వర్మ మాత్రం వారిని పట్టించుకోరు. ఇప్పుడు సేనాని అభిమానులు తనపై పడి ఏడిస్తే ఆర్జీవీ పైకి 24ని కాదు 40ని చూడండి అనే టైటిల్‌తో సినిమా తీసినా తీసి వారి తిక్క కుదురుస్తాడు. అందువల్ల ఆయన జోలికి వెళ్లకపోవడమే బెటర్..
హేయ్ @PawanKalyan , 24 + 7 x 3 = 45 అయితే 151 + 7 x 22 = 303 అయితే వేర్ ఇస్ 175 ?
ఈ లెక్కకేమైనా తిక్కుందా ? 😳😳😳
— Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2024
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2024