జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి మీ అందరికీ తెలిసే ఉంటుంది. గత ఏడాది జనవరి 24 న పవన్ కళ్యాణ్ తన వారాహికి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక పూజలు చేయించింది ఇక్కడే . ఆ తరువాత అక్కడికి వచ్చిన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇహ పై వారాహి మీద ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి ప్రశ్నిస్తానని, పోరాటాలు చేస్తానని గదలు పట్టుకొని శపధం చేశారు. ఆ తరువాత ఈ యాడాదిలో కేవలం నాలుగు సార్లు మాత్రమే వారాహి పై ఏపీకి వచ్చిన పవన్ తరువాత ఆ వాహనాన్ని ఏం చేశారో కానీ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేస్తారు అని ఆశించిన జన సైనికుల్ని మాత్రం మోసం చేశారు.
జన సైనికుల్ని వెఱ్ఱి వాళ్ళని చేయటం ఆయనకి కొత్త కాదు కానీ వారాహి పూజకి అయిదేళ్ల ముందే కొండగట్టు ఆంజనేయ స్వామికి శఠగోపం పెట్టాడు మన సేనాని,
2018 జనవరి 22 న కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొన్న పవన్ ఆ గుడికి 11 లక్షల రూపాయల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించి పూజారుల చేత విశేష పూజలు చేయించుకొని, ప్రత్యేక ప్రసాదాలు పొంది పోయారు కానీ ప్రకటించిన విరాళం మాత్రం అందించలేదు.
ఇది జరిగిన అయిదు సంవత్సరాలకి మళ్ళీ వారాహి పూజలు కోసం అంటూ ఆంజనేయ స్వామి గుడికి పవన్ వస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన విలేఖరి ఒకరు గతంలో ఈ గుడికి పవన్ పదకొండు లక్షలు విరాళం ఇచ్చాడు కదాని ప్రశ్నించగా ఆయన పదకొండు లక్షలు ప్రకటించాడు కానీ పదకొండు రూపాయలు కూడా ఇవ్వలేదని చెప్పడంతో మూర్చబోవడం ఆ విలేఖరి వంతు అయ్యింది.
ఆంజనేయుడు చిరంజీవి కాబట్టి ఈ ద్రోహన్ని తట్టుకొని నిలుచున్నాడు కానీ వేరే వాళ్ళయ్యుంటే పాపం