“పొత్తులకు విఘాతం కలిగించే వారిని ప్రజలు గమనించకపోరు” అంటూ జనసేన నేతలను పవన్ కళ్యాణ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా అంటే అవునూ అనే విధంగానే ఉంది ఆయన నిన్న జనసేన పేరుతో రిలీజ్ చేసిన లేఖ. రాష్ట్ర ప్రయోజనాలు, సమగ్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం పొత్తుకు కారణాలంటూ పెద్ద పెద్ద పదాలు వాడిన పవన్‌కళ్యాణ్… అసలు పొత్తుకు చంద్రబాబుకు తాను చేస్తున్న బానిసత్వం అని మాత్రం చెప్పట్లేదు.
ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్‌కళ్యాణ్ తన పార్టీలో వారు ప్రశ్నిస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. జగన్‌ను పదేపదే నియంత అంటూ సంబోధించే పవన్ కళ్యాణ్ తన పార్టీలో మాత్రం ఒంటెద్దు పోకడలు పోతూ, తాను చెప్పినట్టు మాత్రమే నడుచుకోవాలంటూ జనసైనికులను బానిసలుగా చూస్తున్నారు.
ఇప్పటికే, పొత్తు పై సుముఖత లేనివారూ, టీడీపీ సీట్లు సర్దుబాటు విషయంలో రాజకీయాలు చేస్తుంది అని నమ్ముతున్నవారూ, క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలను అసలు టీడీపీ కార్యకర్తలు పట్టించుకోకుండా వెళ్ళడాలు వంటివి చూస్తున్న జనసేనలోని చోటా మోటా నేతలు గుర్రుగా ఉన్నారని గమనించిన పవన్‌కళ్యాణ్ అటువంటి విషయాలు ఏమైనా ఉంటే పబ్లిక్‌లో మాట్లాడొద్దని, నా పీఏ కి చెపితే అతనొచ్చి నా చెవిలో చెబుతాడనీ, నేను అపుడు ఆలోచిస్తాను అని మీరు మాత్రం ఏం చేసినా ప్రజలు గమనించి మీకు తగిన శాస్తి చేస్తారంటూ అర్థాలు వచ్చేలా ప్రెస్నోట్లు రిలీజ్ చేసి జనసేన నాయకులకు మరింత ఉక్రోషం వచ్చేలా చేస్తున్నారు. మరి ఈ “నియంత – బానిస” చట్రంలో ఎంతమంది ఇమిడి జనసేనతో కొనసాగుతారో చూడాలి మరి!!!