జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లో మంచితనం కాగడా పెట్టి వెతికినా అతనిలో కనిపించదు. ఇంత కన్నా దిగజారడడేమో అని అభిమానులు భావించిన ప్రతిసారీ లేదు.. మీరు ఊహించని దాని కన్నా నేను దిగజారిపోయానని రుజువు చేసుకుంటూ ఉంటాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం విషయంలో సేనాని నీచ రాజకీయాలకు పాల్పడి తన ఉన్మాదిని మరోసారి బయటపెట్టాడు.
దేశ ప్రధాని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు జగన్‌కు సంఘీభావం తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని ప్రకటించారు. కానీ జనసేన మాత్రం హుందాతనం ప్రదర్శించలేకపోయింది. తెలుగుదేశం తోక పార్టీ తరహాలో సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించింది. దాని ప్రధాన కార్యదర్శి నాగబాబు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై వారి నాయకులు, కార్యకర్తలే ఛీ కొట్టారు.
జగన్‌పై నిత్యం అసూయతో రగలిపోయే పవన్ పాతాళ స్థాయికి దిగజారిపోయి మాట్లాడాడు. తన దత్తతండ్రి చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో జరిగిన కుట్ర.. విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా చేయించిన పనిగా కళ్ల ముందు కనిపిస్తున్నా వారికేం సంబంధం లేదన్నట్లుగా మాట్లాడాడు. ఎన్నికల ప్రభార సభలో జగనే కొట్టుకుని ఉంటాడని యాక్షన్ చేసి చూపించాడు. హత్యాయత్నాన్ని డ్రామాగా అభివర్ణించాడు. అంతటితో ఆగకుండా తన సైకో ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో నీచాది నీచంగా పోస్టులు పెట్టించాడు. జనసేన అఫిషియల్ పేజీల్లో అయితే ‘మన జగనే.. మొన్న గులకరాయి తగలింది కదా.. అప్పట్నుంచే’ అంటూ కార్టున్ పెట్టించి శునకానందం పొందాడు.
జగన్‌ను చులకనగా మాట్లాడిన సేనాని తన దగ్గరకు వచ్చే సరికి మెలో డ్రామాకు తెరతీశాడు. ప్రత్యర్థి పార్టీల వారు బ్లేడ్లతో కోస్తున్నారని ఆరోపించాడు. వాస్తవానికి అతని చుట్టూ ఉండేది కరుడుగట్టిన అభిమానులే. సైకో మనస్తత్వం కలిగిన వారిని దాటుకుని ఇతరులు వెళ్లడం అసాధ్యం. కానీ కోసేస్తున్నారంటూ సింపతీ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ఎన్నికల సభలో రక్షణ సిబ్బంది చేత ప్లాస్టిక్ పలకలను రక్షణగా పెట్టించుకున్నాడు. వైఎస్సార్సీపీ వాళ్లు రాళ్లు వేస్తారని ఇలా చేశారని ప్రచారం చేసుకున్నారు. చీప్ ట్రిక్స్ చేయడంలో సేనానిని మించి రాజకీయ నాయకుడు మరొకడు ఉండడేమో అనే విధంగా ప్రవర్తిస్తుంటాడు. అంతటితో ఆగకుండా పవన్‌కు భద్రత ఏదీ అంటూ చంద్రజ్యోతిలో కథనం రాయించున్నాడు. నాకు ప్రధాని నరేంద్రమోదీ తెలుసు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలుసు. వాళ్ల ఫోన్ నంబర్లు ఉన్నాయని అభిమానుల దగ్గర బిల్డప్ ఇస్తుంటాడు. అలాంటప్పుడు వారికి ఒక మాట చెబితే ఏదో ఒక కేటగిరిలో సెక్యూరిటీ ఇచ్చేస్తారుగా.. కానీ ఈయనకు అంత సీన్ లేదనేది తెలుగు తమ్ముళ్ల మాట. పవన్ ఇలాగే ఉన్మాదితత్వానికి ఏదో ఒకరోజు చంద్రబాబే చెక్ పెడతాడు. అప్పుడు కళ్లు తెరుచుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదు.