2009 లో ప్రజారాజ్యం పార్టీ తరపున ప్రచారం చేస్తూ బాబు ని మించిన అవినీతి పరుడు దేశంలో లేడు అన్నాడు..
కట్ చేస్తే యూ టర్న్:
2014 కి సొంతగా పార్టీ పెట్టి అబ్బే మనం అప్పుడే పోటీ చేయలేం అండి, బాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అండి అంటూ బాబుకు మద్దతు ఇవ్వడమే గాక బాబు ఇచ్చే హామీలకు నాదీ పూచీ అన్నాడు..
కట్ చేస్తే యూ టర్న్:
బాబు అవినీతికి అడ్డు లేకుండా పోయింది, వాళ్లబ్బాయి లోకేష్ అవినీతికి పరాకాష్ట అంటూ, మా అమ్మని తిట్టించారు, మా ఆత్మాభిమానం మీద కొట్టారు మిమ్మల్ని వదిలిపెట్టను అని భీష్మ ప్రతిజ్ఞ చేసి 2019 లో ఒంటరిగా పోటీ చేశాడు..
కట్ చేస్తే యూ టర్న్…
జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికీ సీఎం కాలేడు ఇది శాసనం అన్నాడు.. జగన్ సీఎం అయ్యాడు. జగన్ మంచి పాలన అందిస్తే నేను వెళ్లి సినిమాలు చేసుకుంటా రాజకీయాలు అవసరం లేదు అన్నాడు. అన్నట్టుగానే సినిమాలు చేసుకుంటున్నాడు, అంటే జగన్ పాలన బావున్నట్లే. కానీ మళ్లీ బాబు సంక ఎక్కాడు. రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మళ్లీ బాబు రావాలి అంటున్నాడు. పదేళ్ల పాటు పొత్తు ఉండాలి అంటున్నాడు. పదేళ్ల పాటు పొత్తు ముందే నిర్ణయించుకునే దిక్కుమాలిన పార్టీ దేశం మొత్తం మీదే ఇదొక్కటే కాబోలు..
ఇవాళ మాట్లాడిన మాట రేపు ఉండదు. వాలంటీర్ల విషయంలో అయినా, బాబు గురించి అయినా, రాజధాని విషయంలో అయినా, జీరో బడ్జెట్ పాలిటిక్స్ విషయం అయినా, జనసేన సిద్ధాంతాలు అయినా, కుల ప్రస్తావన లేని రాజకీయం అన్నా….. ఏ ఒక్కటీ నిలకడ లేనిమాటే, వెంటనే యూ టర్నే.. యూ టర్న్ విషయంలో పవన్ బాబుకు పోటీ వస్తున్నాడు…