పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన మాజీ మంత్రి, కొత్తపల్లి సుబ్బారాయుడు ఎట్టకేలకు జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చడంతోనే ఆ పార్టీలో చేరనున్నట్లు కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. కొత్తపల్లి జనసేనలోకి రావడంతోతో తమ పార్టీ మరింత బలపడుతుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికే నమ్ముకున్న వారికి టికెట్ కేటాయించడంలో విఫలం చెందిన పవన్ కళ్యాణ్ మరోసారి కూడా అదే బాట పట్టినట్టు కనిపిస్తుంది.
నరసాపురం అసెంబ్లీ సెగ్మెంట్ కి చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు విజయం సాధించారు. తొలుత టీడీపీ అభ్యర్థిగా 1989 నుంచి 2004 వరకూ వరుసగా గెలిచిన ఆయన ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి. 2012 ఉప ఎన్నికలో మరోసారి గెలిచారు. తరువాత మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో వైసీపీలో చేరినా స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు.
నరసాపురం నియోజకవర్గంలో 5 ఏళ్ళు కష్టపడి జనసేన జండా మోసిన బొమ్మిడి నాయకర్ గారికి ఇవ్వకుండా ఇప్పుడు వచ్చిన కొత్తపల్లి సుబ్బారాయుడుకి ఇవ్వడం ఏంటని జనసైనికులే తిరుగుబాటు జండా ఎగరేస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ సీటు అన్నా కష్టపడ్డ జనసైనికులకి దక్కుతుందా లేక తెలుగుదేశం నుండి చివరినిమిషంలో వలస వస్తున్న నాయకులకే పవన్ కట్టబెడతాడా అనేది వేచి చూడాలి.