ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పతకాలు అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పోలీస్, అగ్నిమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్ విభాగాల్లోని మొత్తం 1,132 మంది అధికారులకు నాలుగు కేటగిరీల్లో పతకాలను ప్రకటించారు. మన రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది ప్రతిభా సేవా పతకాలకు ఎంపికయ్యారు. వారిలో కమాండెంట్ కోటనాని వెంకట ప్రేమ్‌జిత్, ఆర్ఎస్ఐ ఆవుల చెన్నయ్య, ఏఎస్ఐ ఆర్.రమణారెడ్డి, ఇన్స్పెక్టర్ అద్దంకి వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ బి.ప్రకాశ్‌రావు, ఏఎస్ఐ కరి మస్తాన్‌రావు, అసిస్టెంట్ కమాండెంట్ పుల్లభొట్ల వెంకట సత్య అనంత దుర్గప్రసాద్రావు, ఇన్స్పెక్టర్ అక్కిశెట్టి శ్రీహరిరావు, డీఎస్పీ కోటిరెడ్డికి ప్రతిభా సేవా పతకాలు దక్కాయి. ఇంకా ఏపీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ పెనికలపాటి వెంకటరమణ, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ జాస్తి రమణయ్య, లీడింగ్ ఫైర్‌మన్ షేక్ ఘనీ ఫైర్ సర్వీసెస్ కేటగిరీలో ప్రతిభా సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఈ ఏడాది బీఎస్ఎఫ్కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులకు మరణానంతరం రాష్ట్రపతి శౌర్య పతకాలను కేంద్రం ప్రకటించింది. కాగా దేశవ్యాప్తంగా 275 మంది. శౌర్యపతకాలకు, 102 మంది రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు, 753 మంది ప్రతిభా సేవా పతకాలకు ఎంపికయ్యారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏడాది కేంద్ర హోంశాఖ రెండుసార్లు పతకాలు ప్రకటిస్తుంది. ఇది రాష్ట్రానికి ఎంతో గర్వించదగిన విషయం. మన పోలీసులు ప్రతిభ చూపి పతకాలకు ఎంపిక కావడంపై ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. వారిని అభినందించారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారి పార్టీల నేతలు నిత్యం పోలీస్ వ్యవస్థపై వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. మేము అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామని బెదిరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. బాబు తన మీటింగ్‌లో రెచ్చగొట్టడంతో తెలుగు తమ్ముళ్లు ఓ కానిస్టేబుల్ కన్ను పోగొట్టారు. పలువురిని గాయపరిచారు. వినాయకచవితి ఉత్సవాల్లో జనసేనకు చెందిన ఓ వ్యక్తి హద్దుమీరి ప్రవర్తించి పోలీస్ చావుకు కారణమయ్యాడు. జగన్ ప్రభుత్వంలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఉంది. అందుకే వారు బాగా పనిచేస్తున్నారు. జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటున్నారు.