సేనాని వలన సున్నం తప్ప ప్రయోజనం సూన్యం అని బిజెపి భావిస్తుందా.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండదని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి స్పష్టం చేశారు. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని జనసేనతో ఎలాంటి పొత్తు ఉండబోదని ఆయన వెల్లడించారు.
కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో జనసేన పార్టీ పొత్తుతో పోటీకి దిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాలు బీజేపీకి 8 నియోజకవర్గాలను జనసేనకు కేటాయించడం జరిగింది. కానీ జనసేన పోటీ చేసిన అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రాకపోవడంతో పవన్ కళ్యాణ్ ప్రభావం తెలంగాణా ఓటర్లపై ఏమాత్రం లేదని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు స్పష్టం చేసాయి.
జనసేన ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని వెల్లడించిన కిషన్ రెడ్డి ఏపీలో జనసేనతో పొత్తు అంశం చర్చకు రాలేదని తెలిపారు. నిజానికి పవన్ కళ్యాణ్ కి ఉన్న జనాకర్షణతో తెలంగాణాలో కొన్ని సీట్లయినా గెలవాలని బీజేపీ ప్రయత్నించి భంగపడింది. జనసేన అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు రాకపోవడంతో తెలంగాణాలో ఆ పార్టీతో పొత్తు వల్ల బీజేపీకి నష్టమే తప్ప లాభం ఉండదని తెలిసివచ్చింది. దాంతో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో జనసేనతో పొత్తు విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తుంది . అందుకే పొత్తు విషయంలో జనసేనతో ఎలాంటి సంప్రదింపులకు చోటివ్వడం లేదు.