రాటకొండ ప్రసాద్ అంటే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు. అదే కిర్రాక్ ఆర్పీ అంటే వెంటనే తెలిసిపోతుంది. జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన ఇతని సొంతూరు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలంలోని సగుటూరు. జబర్దస్ వల్ల కొన్ని సినిమాలు, టీవీ షోలు చేసి పాపులరయ్యాడు. ప్రస్తుతం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వల్ల నిత్యం సోషల్ మీడియాలో నానుతున్నాడు.
ఆర్పీకి ఘనమైన చరిత్రే ఉంది. సినిమా డైరెక్షన్ పేరుతో పలువురిని నట్టేట ముంచాడని తోటి జబర్దస్త్ కమెడియన్ షేకింగ్ షేకింగ్ శేషు ఓ ఇంటర్వ్యూలో ఆరోపించాడు. ఇంకా ఆ షో మేనేజర్ అయిన ఏడుకొండలు కూడా ఆర్పీ ఎలాంటి వాడో చెప్పాడు. నెల్లూరు జిల్లా చిట్టెపల్లికి చెందిన అరుణాచలం అనే వ్యక్తిని కిర్రాక్ ఆర్పీ మోసం చేసినట్లు చెబుతున్నారు. అరుణాచలానికి పురుగు మందుల దుకాణం ఉంది. ఫైనాన్స్, చిట్స్ నిర్వహిస్తుంటాడు. పద్మజ పిక్చర్స్ బ్యానర్‌పై అరుణాచలం నిర్మాతగా ఆర్పీ 2020లో ఓ సినిమా ప్రారంభించాడు. ఇందుకోసం లగ్జరీ ఆఫీసు పెట్టారు. జేడీ చక్రవర్తి, రావు రమేష్ లాంటి వారిని ఎంచుకుని షూటింగ్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు చేశారు. ప్రొడ్యూసర్ చేత ఆఫీసు, అడ్వాన్సుల పేరుతో బాగా ఖర్చు పెట్టించాడు. కానీ ఆ సినిమా ఆగిపోయింది. దీంతో నిర్మాత బాగా నష్టపోయాడు. అయితే ఆయన కొడుకు రామ్సాయిని పెట్టి సినిమా తీస్తానని ఆర్పీ నమ్మించాడు. ఫొటోషూట్లు చేశారు. కార్యాలయం తెరవాలని చెప్పి వీలైంత జుర్రేశాడు. మొత్తం రూ.2.50 కోట్ల మేర అరుణాచలం సొమ్మును సినిమాల పేరుతో ఆర్పీ లాగేశాడని ప్రచారం ఉంది. మోసపోయిన అతను సదరు జబర్దస్త్ నటుడిపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అరుణాచలం పూర్తిగా దెబ్బతిని రూ.5 కోట్లకు ఐపీ పెట్టినట్లు సమాచారం.
ప్రభాస్ కజిన్‌తో ఓ సినిమా తీస్తున్నానని ఆర్పీ మోసాలకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఓ నిర్మాత చేత విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టించాడని తెలుస్తోంది. ఈ విషయాలను జబర్దస్త్ మేనేజర్ ఏడుకొండలు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమా తీస్తున్నా.. మీరు మేనేజర్‌గా ఉండాలని అడ్వాన్స్ ఇచ్చాడు. కానీ ఆ మూవీ ఆగిపోయింది. ఏమని అడిగితే నటుడికి హెవీ బాడీ ఉంది. తగ్గాక తీస్తాననన్నాడు. ఆర్పీ ఫ్రాడ్ అని తెలియడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేశా అన్నారు.
ఆర్పీ మోసాలు ఎన్నో ఉన్నట్లు ప్రచారం ఉంది. జబర్దస్త్‌లో, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని యువతకు చెప్పి డబ్బు దండుకున్నట్లు తెలుస్తోంది. అరుణాచలం మోసపోయిన తీరు తెలియడంతో చాలామంది ఆర్పీకి దూరంగా ఉంటున్నారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఫ్రాంచైజీల పేరుతోనూ వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. అన్నం పెట్టి, జీవితం ఇచ్చిన జబర్దస్త్ షో ప్రొడ్యూసర్ శ్యామ్ప్రసాద్రెడ్డినే తిట్టిన చరిత్ర కిర్రాక్ ఆర్పీది.