జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ కార్యకర్తల పై రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు సదభిప్రాయం లేదనే చెప్పాలి. జనసేన పార్టీ పెట్టకముందు పవన్ కళ్యాణ్ అనే నటుడు ఎలా ఉన్నారన్నది ప్రజలకు అవసరంలేని విషయం. కానీ ఒక రాజకీయపార్టీ పెట్టి ప్రజల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాక నాయకుడిగా క్రమశిక్షణ అవసరం.. పవన్ కళ్యాణ్ కు ఆ క్రమశిక్షణ లేదనే విషయం చాలా సందర్భాలలో ప్రూవ్ చేసుకుంటూనే ఉంటాడు. యథా రాజా తథా ప్రజా అన్న చందంగా అభిమానిస్తున్న నాయకుడు ఎలా ఉంటే ఆయన అనుచరులు కూడా అలానే ఉంటారు. పవన్ విషయంలో కూడా అదే జరుగుతుంది.. జనసేన సైనికులు ప్రతి నెలా ఆడవారిని వేధించిన కేసుకో, మోసం చేసిన దానికో, హత్య చేసారనో ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటుంటారు.. క్రమేణా అది ఆ పార్టీ ఆనవాయితీ అనేలా మారిపోయింది. జనసేన కార్యకర్తలు, నాయకులు మహిళలను వేధించిన కేసులు చూస్తే వీళ్ళా ప్రశ్నిస్తాం, రాష్ట్రాన్ని ఉద్దరిస్తాం అని ఓట్లడిగేది అని అసహ్యం వేయక మానదు. అలాంటి ఘటనలు కొన్ని చూద్దాం.
ఆడవారిని మోసం చేయడం, ఇబ్బందులకు గురిచేయడం ఇవన్నీ జనసేన కార్యకర్తల, నాయకుల నిత్యకృత్యాలు అయిపోయాయి . ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా భాద్యతాయుత స్థానంలో ఉన్న పవన్ ఇలాంటి దుచ్చర్యలను ఖండించకపోవటం, వాటికి పాల్పడిన కార్యకర్తలుని, నాయకులని సస్పెండ్ చేయటం లాంటి కనీస చర్యలు కూడా చేపట్టకపోవడం బాధాకరం .