గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ రాంబాబు సస్పెన్షన్ కు గురయ్యారు . గుంటూరు రూరల్ మండలం వెంగలాయపాలెం గ్రామంలోని ఇరువర్గాలకు మధ్య జరుగుతున్న ఒక స్థలం వివాదం నేపథ్యంలో సీఐ రాంబాబు ఒక వర్గం వారిని ఇబ్బంది పెడుతున్నారు అంటూ వారు ఇటీవల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు, అనంతరం అతనిపై ఉన్నతాధికారులు విచారణ నిర్వహించి గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుకి నివేదిక అందించారు .
ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై అధికారుల నివేదిక మేరకు సస్పెండ్ చేశారు, గతంలో సబ్ ఇన్స్పెక్టర్ గా భాద్యతలు నిర్వహించిన రాంబాబు 2023 లో సీఐ గా పదోన్నతిని పొందిన ఆయనకి తొలి పోస్టింగ్ నల్లపాడు స్టేషన్ లో కేటాయించారు . సీఐ గా ప్రమోషన్ పొందిన నెలల వ్యవధిలోనే సస్పెండ్ కావడం, ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఈ సంఘటనపై పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.