రాష్ట్ర ప్రభుత్వ గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో గత నాలుగేళ్లుగా ఉద్యోగ వేతనాలు, పెన్షన్ల వ్యయం భారీగా పెరిగింది అని కాగ్ నివేదిక స్పష్టం చేసినట్లు 2022-23 ఆర్థిక సంవత్సరం నివేదికను ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించింది.
2019-20 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల పెన్షన్ల వ్యయం రూ.17, 385 కోట్లు ఉండగా, 2022-23 నాటికి రూ.22,584 కోట్లు అయ్యాయి. అంటే నాలుగు ఏళ్లలో పెన్షన్ల వ్యయం రూ.4,942 కోట్ల మేర పెరిగింది.
అలాగే ఉద్యోగాల వేతనాలు వ్యయం 2019-20 నాటికి రూ.36,179 కోట్లు ఉండగా, 2022-23 నాటికి రూ. 49421 కోట్లు అయింది. అంటే నాలుగేళ్లలో వేతనాల వ్యయం రూ.13,242 కోట్ల మేర పెరిగింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.40,909కోట్లు ఉన్న వ్యయం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.49,421 కోట్లకు చేరుకుంది.అంటే ఒక ఆర్థిక సంవత్సరంలోనే రూ.8512 కోట్ల పెరిగింది, 19.18 శాతం మేర పెరిగినట్టు కాగ్ అకౌంట్స్ నివేదిక పేర్కొంది. ఈ వ్యయం పెరుగుతుండడంతో తప్పనిసరి రెవెన్యూ వ్యయం ఏటేటా పెరుగుతోందని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేసింది.