స్మార్ట్ ఫోన్.. ప్రపంతం ఇప్పుడు దీని ఆధారంగానే నడిస్తోందని చెప్పుచ్చు. ప్రతి రంగం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. ఎన్నికల నిర్వహణలో ఈసీ అనేక యాప్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. అక్రమాల కట్టడి, ఫిర్యాదుల స్వీకరణ, అనుమతుల జారీ తదితర వాటి కోసం ఉన్న యాప్స్‌పై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్. ఇందులో కొత్తగా ఓటును నమోదు చేసుకోవచ్చు. డిజిటల్ ఓటర్ స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓటర్ల జాబితాలోని జనాభా, ఇతరుల పేర్లు, వివరాలను తెలుసుకోవచ్చు.
ఎన్నికల కమిషన్ తెచ్చిన యాప్‌లో ముఖ్యమైంది సీ విజిల్. నగదు, మద్యం పంపిణీ, బహుమతులు, పోస్టర్లు, బ్యానర్లు, ఆయుధాల ఆయుధాల ప్రదర్శన, బెదిరింపు, పెయిడ్ న్యూస్, ఆస్తుల ధ్వంసం చేయడం తదితర వాటిపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. సువిధ యాప్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి అనుమతులకు దీనిని వినియోగించుకోవచ్చు. వాహనాలకు, మైక్ సెట్ల వినియోగానికి, బహిరంగ సభలు, సమావేశాలకు రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకుంటే 24 నుంచి 48 గంటల్లో అనుమతి ఇస్తారు. ఎన్నికల నిబంధనలు, సేవలు వంటి అంశాలపై దివ్యాంగులకు అవగాహన కలిగించే యాప్ సాక్ష్యం. ఇంటి దగ్గరే ఓటు హక్కు వినియోగంచుకోవడానికి ఇందులో వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇందులో వాయిస్ టైపింగ్ టూల్, యాక్సెసిబిలిటీ ఫీచర్లు, పోలింగ్ స్టేషన్ల సమాచారం ఉంటుంది.
ఇంకా పబ్లిక్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఓటు ఉందా?, లేదా?, ఉంటే ఏ పోలింగ్ కేంద్రంలో ఉంది?, అది ఎక్కడ ఉంది? బూత్ లెవెల్ అధికారి ఎవరు? ఫొటో ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్య వంటి ఓటర్లకు అవసరమైన సమస్త సమాచారాన్ని దీని ద్వారా తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. కేవైసీ యాప్‌లో పోటీలో ఉన్న రాజకీయ పార్టీ అభ్యర్థుల వివరాలన్నీ ఉంటాయి. అభ్యర్థులపై క్రిమినల్ కేసులు తెలుసుకోవచ్చు. ఇంకా సుగం యాప్ అని ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు గూగుల్ ప్లేస్టోర్‌లో, ఐఓఎస్ యూజర్లకు యాప్ స్టోర్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి.