ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఆసియా పసిఫిక్ క్లైమేట్ సెంటర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఆసియా పసిఫిక్ క్లైమేట్ సెంటర్ వాతావరణాన్ని మరింత మెరుగ్గా అంచనా వేయడానికి ఎల్ నినో సౌతెర్న్ అసిలేషన్ ను ప్రవేశ పెట్టింది. ఈ ఎన్ యస్ ఓ ద్వారా వాతావరణాన్ని 3 నుంచి 6 నెలలు ముందుగా అంచనా వేయొచ్చు. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో భారీ వర్షాలు పడొచ్చు అని ఈ ఎన్ యస్ ఓ అంచనా వేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అధికంగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి అని తెలిపింది.
ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే ఎక్కువుగా వర్షాలు ఉంటాయి ప్రస్తుతం ఉన్న ఎల్ నినో పోతుంది..లానిన వస్తుంది అంటూ ప్రకటించింది. ఎల్ నినో , లానిన వర్ష నమోదు సూచికలు. దేశ వ్యాప్తంగా చూస్తున్నాం వర్షాలు పడక ఎంతోమంది ఎన్నో అవస్థలు పడుతున్నారు. వర్షం పడకపోవడంతో రైతన్నలకు చేతికి అందాల్సిన పంట చేతికి అందకుండానే పోతుంది. ఈ రోజుల్లో తరచూ చూస్తున్న బెంగళూరు వంటి మహా నగరాల్లో నీటి సమస్య అధికంగా ఉండడం ప్రభుత్వాలకు ఏమి చేయాలో అని దిక్కు తోచని పరిస్థితి.మన దేశంలోని చాలా రాష్ట్రాలలో త్రాగు నీటి ఎద్దడి అధికంగా ఉంది. వాటర్ ట్యాంకర్ లలో దూర ప్రాంతాల నుంచీ నీళ్లు తోలాల్సిన పరిస్థితి. వేసవి పూర్తి స్థాయిలో మొదలు కాకముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో అంచనా వేయలేని పరిస్థితి అనుకుంటున్న సమయంలో ఏపీసీసీ ప్రకటనతో కాస్తా ఉపశమనం కలిగించింది. వర్షాలు త్వరగా అధికంగా పడి నీటి కష్టాలు తీరాలని కోరుకుందాం.