రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్లకు అండగా నిలిచింది. వారికి పెండింగ్లో ఉన్న రూ.23.17 కోట్ల బకాయిలను విడుదల చేసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెక్కును విడుదల చేసి వివరాలు వెల్లడించారు. 2012 నుంచి ఐసీడీఎస్ ప్రాజెక్టుకు సరఫరా చేసిన సరుకుల కమీషన్ డబ్బు రూ.25 కోట్లను డీలర్లకు చెల్లింపులు చేశామన్నారు.
ఇదే సమయంలో ఆయన ఈనాడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. డోర్ డెలివరీ ద్వారా ప్రస్తుతం సరుకుల సరఫరా జరుగుతోందని, రేషన్ డీలర్లను వ్యవస్థను కొనసాగిస్తున్నామని తెలిపారు. అయితే రామోజీరావుకి మతిభ్రమించి ఈనాడులో తప్పుడు కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు లాగే ఆయనకు కడా అల్జీమర్స్ వచ్చి ఉంటుందన్నారు. రామోజీ ఎన్ని దొంగ రాతలు రాసినా ప్రజలు పట్టించుకోరన్నారు. బాబు, ఎల్లో మీడియాను ప్రజలు అసహ్యించుకుంటారని చెప్పారు. పేదల పక్షపాతిగా ఉన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే జనం ఉన్నారని స్పష్టం చేశారు.