సిద్ధం పేరుతో భీమిలిలో మొదలుపెట్టిన ఎన్నికల శంఖారావం ఎంత విజయవంతం అయిన సంగతి మనకు తెలిసిందే. ఇపుడు పార్టీ శ్రేణులను, ప్రజలను మరింత ఉత్తేజపరచి ఆకట్టుకునేందుకు ఏలూరులో సిద్ధం సభ జరగనుంది.
ఫిబ్రవరి మూడున ఏలూరులో సభకై సన్నాహాలు మొదలయ్యాయి. లక్షలాదిమంది హాజరయ్యేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరు నగర సమీపంలో దెందులూరు జాతీయ రహదారి వద్ద 110 ఎకరాల స్థలాన్ని ఈ సభా ప్రాంగణం కోసం ఎంచుకున్నారు.
భారీ వేదిక నిర్మించి, జగన్ హెలికాప్టర్ నుంచి దిగేందుకు వీలుగా, కార్యకర్తలకు అభివాదం చేస్తూ నడిచివెళ్ళేలా ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సన్నాహాలను ఎంపీ మిధున్ రెడ్డి, ఆళ్ళ నాని పరచయవేక్షిస్తూ జిల్లా చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఈ సిద్ధం సభ ఉండబోతుందని తెలిపారు.