నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ అరంగేట్రం చేసిన బాలకృష్ణ తన స్థాయి మరిచి తన స్థానాన్ని మరిచి పరువు పోగొట్టుకున్న సందర్భాలు అనేకం. అసభ్య ప్రవర్తనతో తన వ్యక్తిత్వాన్ని తానే దిగజార్చుకున్న పరిస్థితులు కోకొల్లలు.. ఏళ్లు గడిచే కొద్ది పెద్దరికాన్ని అందిపుచ్చుకుని పదిమందికి మార్గదర్శిగా ముందుకు సాగాల్సిన బాలకృష్ణ, తన అనుచిత ప్రవర్తనతో ఎప్పటికప్పుడు అపవాదులు మూట కొట్టుకుంటున్నాడు. అందులో భాగంగానే మహిళల పట్ల బాలకృష్ణ అనుచిత ప్రవర్తన అనేక సందర్భాలలో వివాదాస్పదంగా మారింది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి వివాదాల్లో చిక్కుకోవడం బాలకృష్ణకు అలవాటుగానూ మారిపోయింది.
తాజాగా విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరైన బాలకృష్ణ మరోసారి తన అనుచిత ప్రవర్తనను బయటపెట్టాడు. తనకు అలవాటుగా మారిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే విధానాన్ని మళ్లీ ఇండస్ట్రీకి గుర్తు చేశాడు. ఈ నెల 31వ తారీఖున థియేటర్లలోకి రాబోతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ప్రమోషన్స్ కి వచ్చిన బాలకృష్ణ, ఆ మూవీ కథనాయక అంజలిని దురుసుగా త్రోసివేయడంతో పాటు, వాటర్ బాటిల్ లో మద్యం కలుపుకొని వేదిక పైనే సేవించాడు. అయితే అంత మంది చూస్తుండగా వేదికపై తనని అలా తోయడంతో ఒక్క క్షణం అంజలి విస్మయానికి గురైంది. అయినప్పటికీ కూడా తనను తాను తగ్గించుకుని చాలా హుందాగా వేదికపైనే నిలబడి నవ్వుతూ కార్యక్రమం పూర్తయ్యేంతవరకు తన బాధ్యతను నిర్వహించింది.
అయితే బాలకృష్ణ ఇలా ప్రవర్తించడం అనేది ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అనేక సందర్భాలలో మహిళలు పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ తన విలువ తానే దిగజార్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అందులో భాగంగానే కొన్నాళ్ల క్రితం భలేవాడువి బాసు చిత్రంలో బాలకృష్ణతో నటించిన తమిళ నటి విచిత్ర బాలకృష్ణ పేరు ప్రస్తావించకుండా తనతో అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాన్ని మీడియాతో పంచుకున్నారు. ఇంతకుముందు బాలకృష్ణతో కలిసి నటించిన రాధిక ఆప్టే కూడా తన విషయంలో బాలకృష్ణ ప్రవర్తనను మీడియా ముందు ఏకరువు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ మధ్య కాలంలో అయితే ఒక సభా వేదికపై బాలకృష్ణ మాట్లాడుతూ అమ్మాయి కనబడితే కడుపైనా చేయాలి, ముద్దైనా పెట్టాలి, లేదంటే నా అభిమానులు ఒప్పుకోరు అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఇప్పుడు తాజాగా సభా వేదికపై తాగడమే కాకుండా ఆడవాళ్ళతో తప్పుగా ప్రవర్తించడం బాలకృష్ణను మరింత విమర్శల పాలు చేస్తుంది. ఏది ఏమైనా బాలకృష్ణ తన పద్ధతిని మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇండస్ట్రీ బహిష్కరించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అంటున్నారు సినీ విమర్శకులు.