ఈ ఏడాది ఫిబ్రవరి 25న నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ముందుగా పరీక్షకు హాజరైన అభ్యర్థుల మొత్తం నుండి 1:50 రేషియో లో మెయిన్స్ కు క్వాలిఫై చేస్తామని నోటిఫికేషన్ లో ప్రకటించగా, ప్రిలిమినరీ పరీక్ష లో చాలా ప్రశ్నలు కఠినంగా వచ్చిన నేపథ్యం లో అభ్యర్థుల కోరిక మేరకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్ కు క్వాలిఫై చేస్తామని ప్రకటించిన ఏపీపీఎస్సీ చెప్పినట్లుగానే 1:100 నిష్పత్తిలో మెయిన్స్ కు అర్హత పొందిన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లతో ఒక జాబితా, మెయిన్స్ కు అర్హత సాధించని అభ్యర్థుల హాల్ టికెట్ల నెంబర్లతో మరో జాబితాను విడుదల చేసింది..
ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ (psc.ap.gov.in) నుండి క్వాలిఫయిడ్ జాబితా ను డౌన్లోడ్ చేసుకుని సెర్చ్ లో అభ్యర్థి తమ హాల్టికేట్ నంబర్ ను వెతకడం ద్వారా సదరు అభ్యర్థి మెయిన్స్ కు క్వాలిఫై అయ్యాడా లేదా అని తెలుసుకోవచ్చు… కాగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను జూలై 28న నిర్వహిస్తామని దాని వెంటనే త్వరితగతిన మెయిన్స్ ఫలితాలను కూడా వెల్లడిస్తామని పబ్లిక్ సర్వీస్ కమీషన్ తెల్పింది..