ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశ సగటు దిగుబడి హెక్టార్‌కు 7.5 టన్నులు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇది 8.8 టన్నులుగా ఉందని కొరియా ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో చేసిన అధ్యయనంలో తేలింది. దేశం మొత్తం రొయ్యల ఉత్పత్తిలో 76% ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోందని సదరు సంస్థ చేసిన లోతైన అధ్యయనంలో తేలింది. దేశంలో రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్ర, ఒడిశా, బెంగాల్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో అత్యధికంగా సాగుతునట్టు, ఒక్క ఆంధ్రలోనే 71,900 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఆక్వా ఉత్పత్తులు సాగవుతున్నట్లు, రాష్ట్రంలో అత్యధికంగా 6,34,672 టన్నుల రొయ్యలు ఉత్పత్తవుతున్నట్లు వెల్లడించింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం 91% ప్రాసెస్ చేయని చేప ఉత్పత్తులనే విక్రయిస్తున్నారని, ఆక్వా ఉత్పత్తులు ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి ఏపీలో భారీగా అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఎగుమతి చేసే ఆక్వా ఉత్పత్తులకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 19,894 సంస్దలు ఉన్నాయని, 105 ఫ్రీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, 99 ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉండగా, 74 మంది మాన్యుఫ్యాక్చర్ ఎగుమతిదారులతో పాటు 69 మర్చంట్ వ్యాపారులు ఉన్నారని నివేదిక తెలిపింది.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్లూ ఎకానమీ మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు , నిర్మాణాలతో అక్వా రంగానికి పెద్ద పీట వేసింది. ఆక్వాలో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు జగన్ ప్రభుత్వం ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని మంచి ఫలితాలను సాధించింది. ఫలితంగా అక్వా రంగం ఏపీలో ఆగ్రస్థానంలో నిలిచిందని పలు సంస్థలు చేస్తున్న అధ్యయనంలో వెళ్లడవుతుంది.