సంప్రదాయ వృత్తి, హస్త కళాకారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేకుండా ఆ కళాకారులు బాగా తగ్గిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది, ఈ పథకం ద్వారా కళాకారులకు ప్రోత్సాహం అందించడం ద్వారా వారి వ్యాపారాలను బలోపేతం చేయడం ద్వారా ఆ కళలు కనుమరుగు అవ్వకుండా ఉంటాయని భావించిన కేంద్రం ఈ తరహా పథకం అందుబాటులోకి తీసుకొని వచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పీఎం విశ్వకర్మ యోజన కింద లబ్ధి పొందే వారి కోసం గతేడాది సెప్టెంబర్ లో కేంద్ర ప్రభుత్వం పోర్టల్ ప్రారంభించింది, ఈ పోర్టల్ లో ఆ కళాకారులూ అందురు నమోదు చేసుకోవాలని తెలిపింది,
కాగా జనవరి వరకు దేశంలోని అన్ని రాష్ట్రలలో 3,31,684 మంది నమోదు చేసుకున్నట్లు తెలిపింది. నమోదు చేసుకున్న వారికి ఆ వృత్తుల్లో నైపుణ్య శిక్షణ ఏర్పాటు చేసి వారికి ఇంకా తర్ఫీదు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది. నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి పెట్టుబడి సహాయం క్రింద వారికీ తొలి విడతలో 5 శాతం వడ్డీకే రూ. లక్ష చొప్పున రుణాలు మంజూరు చేస్తారు , దీనికి ఎటువంటి పూచికత్తు అవసరంలేదు . మొదట తీసుకున్న లక్ష రూపాయాలను 18 నెలలు లోపు తిరిగి కట్టాల్సి ఉంటుంది. ఆలా కట్టిన వారికి రెండో విడతలో 2 లక్షల వరకు ఋణం ఇస్తారు అది తిరిగి 30 నెలలు లోపు కట్టాలి. ఈ రుణాలకు అయ్యే క్రెడిట్ గ్యారెంటీ ఫీజును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కాగా ఈ రుణాలను ఎంటర్ప్రైజ్ డెవ లప్మెంట్ కింద లబ్ధిదారులకు మంజూరు చేస్తారు.
నైపుణ్యం పొందిన వారికీ స్కిల్ అప్ డేషన్ కింద అయిదు రోజులుపాటు ప్రాథమిక శిక్షణ ఇస్తారు తర్వాత 15 రోజులు పాటు అడ్వాన్స్డ్ శిక్షణ ఇస్తారు ఆ సమయంలో రోజుకు రూ . 500 భృతి కూడా ఇస్తారు.శిక్షణ పొందిన లబ్ధిదారులకు ఆయా వృత్తులకు సంబంధించిన టూల్ కిట్ తో పాటు ప్రోత్సాహకం క్రింద రూ. 15 వేలు ఇస్తారని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భానుప్రతాప్ వర్మ తెలిపారు. కాగా నమోదులో కర్ణాటక తొలి స్థానం, గుజరాత్ రెండో స్థానంలో నిలవగా.ఏపీ మూడో స్థానంలో ఉందని వివరించారు.
పథకం ఎవరికి వర్తిస్తుందంటే వడ్రంగి పనివారు, బోట్ల తయారీదారులు, పనిముట్లు, కమ్మరి, సుత్తి, టూల్ కిట్ తయారీ దారులు, తాళాలు బాగు చేసేవారు, వెండి, బంగారు నగలు తయారీదారులు, కుమ్మరి, శిల్పి, చెప్పులు, బూట్లు కుట్టే వారు, తాపీ మేస్త్రిలు, బుట్టలు, చాపలు, చీపుర్లు తయారు చేసేవారు, బొమ్మల తయారీదారులు, బార్బర్, చాకలి పని వారు, దర్జీలు, ఫిషింగ్ నెట్ మేకర్లు ఈ విశ్వ కర్మ యోజన పథకంక్రింద నమోదే చేసుకోవచ్చు. ఈ పథకాన్ని లబ్ధిదారులకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. రాష్ట్రస్థాయిలో పరిశ్రమల శాఖ, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను కూడా ఏర్పాటు చేసింది.