వ్యర్థాలను ఉపయోగించి టెక్నికల్ టెక్స్టైల్స్ ఉత్పత్తుల్లో ( సాంకేతిక ఉత్పత్తులు) ఆంధ్ర ప్రదేశ్ దూసుకొని పోతుంది. సాంకేతిక రంగంలో వ్యర్థాలను సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో టెక్నికల్ టెక్స్టైల్స్ కు ఆక్వా రంగం పెద్ద వినియోగదారుగా ఉంది . అరటి వ్యర్థాలతో ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో రాష్ట్రం ఉంది. ఐఐటీ ఢిల్లీ నిర్వహించిన సర్వేలో మొదటి నాలుగు స్థానాలలో రాష్ట్రము చోటు దక్కించుంది. సాంకేతిక ఉత్పత్తుల్లో వైద్య రంగం (మెడిటెక్), వ్యవసాయం, ఆక్వా (ఆగ్రోటెక్), ఆటోమొబైల్ (మొబిటెక్), క్రీడా పరికరాలు (స్పోర్ట్స్ క్), భవన నిర్మాణ సామాగ్రి (బిల్డెక్), గృహోపకరణాలు (హోంటెక్), భారీ టవర్లు (ఇండుటెక్), ప్యాకింగ్ సామాగ్రి (ప్యాల్టెక్) వంటి దాదాపు 12 విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. కానీ మన రాష్ట్రంలో ప్రధానంగా ఆగ్రో టెక్స్టైల్స్, మొబైల్ టెక్స్ టెల్స్, జియో టెక్స్టైల్స్ కు భారీ డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా, జర్మనీ, నేపాల్ తది తర దేశాలకు ఏటా రూ.180 కోట్ల విలువైన సాంకేతిక ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ స్థానికంగా వినియోగం ఉంటోంది.
అరటి వ్యర్థాలతో తయారు చేసే టెక్నికల్ టెక్స్టైల్స్ ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో ఉంది.జనపనార ఉత్పత్తుల్లో ఐదో స్థానం దక్కించుకుంది. రాష్ట్రంలో నూతన పారిశ్రామికవేత్తలు వ్యవసాయ వ్యర్థాలను నూలుగానూ, ఆ తర్వాత వస్త్రం గానూ పలు రకాలుగా వినియోగించే సాంకేతిక ఉత్పత్తులను తయారు చేయడంలో ముందడుగు వేస్తున్నారు. రీసైకిల్ చేసిన వ్యవసాయ వ్యర్థాలను నూలు ఉత్పత్తులు, షూలు, శానిటరీ నాప్కిన్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అరటి ఫైబర్ నుంచి కవర్లు, శానిటరీ ప్యాడ్లు, నూలు, షూలు తయారు చేస్తు న్నారు. పైనాపిల్, అరటి పండు వ్యర్థాల నుంచి వివిధ ఫంక్షనల్ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నారు. సాంకేతిక ఉత్పత్తుల్లో రాష్ట్రం గత ఐదేళ్లలో 8 నుంచి 10 శాతం వృద్ధిని నమోదు చేసింది.
రాష్ట్రంలో సాంకేతిక ఉత్పత్తులు (టెక్నికల్ టెక్స్టైల్స్) కు మూడు పారిశ్రామిక కారిడార్లు, పోర్టులు, పారిశ్రామికీకరణ వంటివి అనుకూల పరిస్థితిని సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో ఏయే రంగాల్లో అనుకూలమంటే, మొబిటెక్,జియో టెక్స్టైల్స్, ఆగ్రోటెక్ టెక్స్టైల్స్.మొబిటెక్ రంగంలో కీయ , ఇసూజీ, అశోక్ లేలాండ్, హీరో వంటి ప్రధాన ఆటోమొబైల్ తయారీదార్ల నుంచి రాష్ట్రంలో తయ్యేరు అయ్యే ఉత్పత్తులకు చాలా డిమాండ్ ఉంది.దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న మన రాష్ట్రంకు జియో టెక్స్టైల్స్ రంగంలోను జియో ట్యూబులు, జియో బ్యాంగ్‌లకు డిమాండ్ ఉంది. ఓడ రేవుల వద్ద తీర ప్రాంతం నీటి కోతకు గురికాకుండా జియో ట్యూబులను వినియోగిస్తారు.చేపల చెరువుల నిర్మాణం, నిర్వహణలోనూ జియో టెక్స్ట్సైల్స్ను ఉపయోగిస్తున్నారు.తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో జియోట్యూబ్ సీవాల్ నిర్మాణం దేశంలోనే మొదటి జియోటెక్స్‌టైల్ ట్యూబ్ నిర్మాణంగా గుర్తింపు పొందింది. రోడ్ల పటిష్టత కోసం కూడా జియో ట్యూబులను వినియోగిస్తారు.
ఆగ్రోటెక్ టెక్స్టైల్స్ విభాగంలో ఉద్యాన రంగంలో ఉపయోగించే పండ్లు,షేడ్ నెట్లు, మొక్కలకు ఉపయోగించే క్రాప్ కవర్ ఉత్పత్తులు.స్థిరమైన వ్యవ సాయ పద్ధతులు, వనరుల సామర్థ్యం, వ్యర్థాల తగ్గింపునకు దోహదం చేస్తాయి. హార్టికల్చర్ ఆగ్రో టెక్స్టైల్స్ వినియోగంతో మంచి దిగుబడులను సాధించవచ్చు. నీటి వినియోగాన్ని 30 నుంచి 45 శాతానికి తగ్గించవచ్చు. ఆక్వా కల్చర్ లోనూ ఫిషింగ్ నెట్స్, ఫిషింగ్ లైన్ల రూపంలో ఆగ్రో టెక్స్ టైల్స్‌కు అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో 2.12 లక్షల హెక్టా ర్లలో విస్తరించి ఉన్న ఆక్వాకల్చర్ రంగం ఆగ్రో టెక్కు ప్రధాన ప్రోత్సాహంగా నిలుస్తోంది. దేశంలో చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ఆగ్రోటెక్, జియోటెక్స్టైల్స్క్క 30 శాతం డిమాండ్ ఉందని సునీత, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రము నుంచి ఎగుమతు అవుతున్న ఉత్పత్తులు ఈ విధంగా ఉన్నాయి అనంతపురం నుంచి సీట్ బెల్ట్‌లు, ఎయిర్ బ్యాగులు. చిత్తూర్ నుంచి శానిటరీ ప్యాడ్స్, తూర్పు గోదావరి నుంచి చేపలు పట్టే వలలు, లైఫ్ జాకెట్లు, ప్రకాశం నుంచి కన్వేయర్ బెల్ట్, పశ్చిమగోదావరి నుంచి జనపనారతో చేసిన హెస్సియన్ వస్త్రం, విశాఖపట్నం నుంచి సన్నటి ఊలు దారాల ఉత్పత్తులు, సీటు బెల్టులు, కన్వేయర్ బెల్టులు ఇలా ఏ జిల్లాకు ఆ జిల్లా నుంచి రూ, 180 కోట్లు విలువగల ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. ఇలా అనేక రకాల రంగాలను ఉపయోగించుకుని రాష్ట్రం అభివృద్హి పథంలో నడుస్తోంది.