అమెజాన్ ఇండియా ‘అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్’ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వరుసగా రెండో ఏడాది MOU కుదుర్చుకుంది. తద్వారా 10000 మంది విద్యార్థులుకి కంప్యూటర్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తారు. రానున్న భవిష్యత్ అంతా కంప్యూటర్ స్కిల్స్ పైనే ఆధారపడి వుంటుంది కాబట్టి వెనుకబడిన విద్యార్థులుకు ఇది మంచి అవకాశం.
ఇప్పటికే 10000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన అమెజాన్ ఇండియా, రానున్న మూడు సంవత్సరాలలో అనగా 2026-27 కి లక్ష మంది విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వాలని అమెజాన్ నిర్ణయించుకుంది. ఈ ఏడాదిలో మొదటగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణంలో ట్రైనింగ్ మొదలుపెట్టనుంది. కాగా ఈ MOU సమగ్ర శిక్షణ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, SCERT డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి సమక్షంలో అమెజాన్ ఇండియా వారితో ఈ ఒప్పందం జరిగింది.