మొదటి ప్రయోగంలోనే గ్రాండ్ సక్సెక్స్ భారత రక్షణ రంగ చరిత్రలో అరుదైన ఘట్టం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ టెక్నాలజీతో పనిచేసేలా అగ్ని-5 క్షిపణిని నిర్మించింది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని-5 క్షిపణికి సంబంధించిన తొలి ఫ్లైట్ టెస్ట్ ను సోమవారం భారత్ విజయవంతంగా నిర్వహించింది. ప్రస్థుత ప్రయోగంతో భారతదేశం MIRV సాంకేతికత అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా, ఫ్రాన్స్ దేశాల సరసన చేరడం గమనార్హం.
ఈ అగ్ని-5 క్షిపణికి 5వేల కి.మీలకు మించిన దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగే సత్తా ఉంది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ (MIRV) టెక్నాలజీతో పనిచేసేలా అగ్ని-5 క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) తయారు చేసింది. ఒకే క్షిపణి వివిధ రకాల వార్ హెడ్ల నుంచి ప్రయోగించగల సామర్థ్యాలను సంతరించుకోవడమే ఎంఐఆర్వీ టెక్నాలజీ ప్రత్యేకత. అగ్ని-5 క్షిపణి 5,500 నుండి 5,800 కిలోమీటర్ల టార్గెట్ ను చేరుకోగలదు. స్వదేశీ ఏవియానిక్స్ సిస్టమ్‌లు, అధిక ఖచ్చితత్వపు సెన్సార్ ప్యాకేజీలను అగ్ని-5 మిస్సైల్‌లో జోడించారు. ఒకే క్షిపణి దాదాపు 10 వార్హెడ్ల వరకు మోసుకెళ్లగలదు. వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. అయితే ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఓ మహిళ, టీమ్ లో అనేక మంది మహిళల పాత్ర ఉందని ఇటీవలే కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత ఆయుధరంగంలోనే ఇదొక అద్భుతపరిణామం..