టిల్లు స్క్వేర్ తో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపిన సిద్ధు జొన్నలగడ్డ ప్రేక్షకులను మరోమారు ఓటిటిలో అడుగుపెట్టాడు. డీజే టిల్లు సీక్వెల్గా మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్ ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కాగా సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించడం విశేషం. తొలిసారి గ్లామర్ రోల్ లో నటించిన అనుపమకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా సిద్దు కామెడీ టైమింగ్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దాంతో పాటు సిద్దు వన్ లైనర్స్ బాగా పేలాయి. అందుకే ప్రేక్షకులు టిల్లు స్క్వేర్ కి బ్రహ్మరథం పట్టారు.
ప్రస్తుతం టిల్లు స్క్వేర్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతున్న టిల్లు స్క్వేర్ ఓటిటిలో కూడా రికార్డుల దుమ్ము దులపడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంటిల్లిపాది హాయిగా ఎంజాయ్ చేయడానికి ఈ వీకెండ్ లో టిల్లు స్క్వేర్ మంచి ఛాయిస్. దీంతో పాటు విజయ్ దేవర కొండ నటించిన ఫ్యామిలీ స్టార్ కూడా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.