నాగ చైతన్యకు గత కొంత కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ లేదు. థాంక్యూ, లాల్ సింగ్ చద్దా డిజాస్టర్లు కావడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ కూడా నిరాశ పరిచింది. దీంతో ఈసారి ముచ్చటగా మూడోసారి చందు మొండేటితో జత కట్టాడు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ప్రేమమ్, సవ్యసాచి వచ్చాయి. తాజాగా మూడోసారి దేశభక్తి కథతో తండేల్ తో వస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండటం గమనార్హం. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
కాగా ఇప్పుడు తండేల్ సినిమా ఓటిటి రైట్స్ ను భారీ ధరకు ఓ ప్రముఖ సంస్థ సొంతం చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్యకు ఒకరకంగా ఇది బిగ్ డీల్ అని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా ఓటిటి రైట్స్ ను నెట్ఫ్లిక్స్ దాదాపు 40 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుందని తెలుస్తుంది. నాగచైతన్య కెరీర్ లో ఇదే పెద్ద డీల్ కావడం విశేషం. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడం అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండడంతో పాటు కార్తికేయ 2 లాంటి భారీ హిట్ తరువాత చందూ మొండేటి తీస్తున్న సినిమా కావడంతో తండేల్ పై మంచి అంచనాలు ఉన్నాయి. నాగచైతన్య నటించిన గత మూడు చిత్రాలు నిరాశ పరిచినా ఆయన తొలిసారిగా నటించిన దూత సిరీస్ కి మంచి స్పందన రావడం కూడా తండేల్ కి భారీ ధర దక్కడానికి కారణాలుగా సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.