ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప ది రూల్’ సినిమా టీజర్ విడుదలైంది. సోమవారం అల్లు అర్జున్ పుట్టినరోజు పురస్కరించుకుని చిత్రబృందం విడుదల చేసిన పుష్ప టీజర్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. కాగా పుష్ప కు సీక్వెల్ గా రూపొందుతున్న పుష్ప ది రూల్ పై ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి.
కాగా ఆ అంచనాలను అందుకునేలా పుష్ప ది రైజ్ ఉన్నట్లు టీజర్ చూస్తే అర్ధమవుతుంది. తిరుపతి గంగమ్మ జాతర నేపథ్యంలో 66 సెకండ్ల టీజర్ ఇప్పుడు అభిమానుల అంచనాలను అమాంతం పెంచేసింది. టీజర్ లో ఒక్క డైలాగ్ లేకున్నా అమ్మోరి గెటప్‌లో అల్లు అర్జున్ ని చూపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్ తో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. పుష్ప ది రూల్ టీజర్ రిలీజ్ అయిన కొద్ది సేపట్లోనే టీజర్ ట్రెండింగ్ లోకి వెళ్లిపోవడం గమనార్హం.
ఎర్రచందనం కూలీ నుంచి స్మగ్లింగ్ సిండికేట్‌కు నాయకుడిగా పుష్ప పుష్ప ది రైజ్ లో చూపించిన విషయం తెలిసిందే. సిండికేట్‌కు నాయకుడిగా మారిన తరువాత అయ్యాక భన్వర్ సింగ్ షెకావత్‌ను ఎలా ఎదుర్కొన్నాడో పుష్ప ది రూల్ లో చూపించనున్నారు. కాగా ఆగస్టు 15 న రిలీజ్ కాబోతున్న పుష్ప ది రైజ్ చిత్రానికి, సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, రష్మిక మందాన ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.