రహీమ్ సాబ్ అని పిలువబడే సయ్యద్ అబ్దుల్ రహీమ్ గారు 1950 నుండి 1963లో మరణించే వరకు భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు కోచ్ మరియు మేనేజర్ గా ఉన్నారు. అతను మోడరన్ ఇండియన్ ఫుట్‌బాల్ కి ఈయన్ని ఆర్కిటెక్ట్ అంటారు . వృత్తి రీత్యా ఉపాధ్యాయులు.. కోచ్‌గా ఉన్న పదవీకాలం భారతదేశంలో ఫుట్‌బాల్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది, ఆయన టైంలోనే మనల్ని “బ్రెజిల్ ఆఫ్ ఆసియా” అని పిలిచేవారు..
రహీమ్ సాబ్ ఆధ్వర్యంలో, భారత ఫుట్‌బాల్ జట్టు ఆసియా క్రీడలలో (1951 & 1962లో) స్వర్ణం గెలుచుకుంది మరియు 1956లో మెల్బోర్న్లో జరిగిన ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. అప్పటి నుండి ఏ ఇతర భారతీయ ఫుట్‌బాల్ జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు.
రహీమ్ స్టూడెంట్స్ మోయిన్, అజీజ్, నూర్ మహమ్మద్, జమాల్ etc హైదరాబాద్ సిటీ పోలీస్ టీమ్‌కి కోచ్‌గా అతని పేరును సిఫార్సు చేసింది. అతనికి జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన టీమ్ హైదరాబాద్ సిటీ పోలీస్. రోవర్స్ కప్, డ్యూరాండ్ కప్, డిసిఎమ్ కప్ వంటి అన్ని ప్రధాన టోర్నమెంట్లను హైదరాబాద్ సిటీ పోలీసులు ఒక సంవత్సరంలో బెంగాల్, పంజాబ్ మరియు కేరళకు చెందిన అన్ని పెద్ద జట్లను ఓడించారు.
రహీమ్ సాబ్ గారి గురించి చాలా మంది మర్చిపోయి ఉంటారు .. ఈ తరుణంలో క్రిందటి వారం రహీమ్ సాబ్ కథ ఆధారంగా నిర్మించిన అజయ్ దేవగన్ నటించిన Maidaan రిలీజ్ అయ్యింది. రహీమ్ గారి ఇద్దరి కొడుకులు సయ్యద్ షాహిద్ హకీం & మహ్మద్ వసీం కూడా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆడారు.