ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన సిద్ధం సభలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భీమిలి, దెందులూరుల్లో జరగ్గా అవి పార్టీకి ఎంతో మైలేజ్ ఇచ్చాయి. తాజాగా ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభలో పాల్గొనేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు రెడీ అంటున్నాయి. పది లక్షల మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రతిపక్షాల కూటమికి వ్యతిరేకంగా గళం విప్పేందుకు తమ స్లీవ్లను సిద్ధం చేసుకుంటున్నారంటూ ఆ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మిలియర్ క్యాడర్ మీట్ అంటూ సభను అభివర్ణించింది. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది.
రాప్తాడు సిద్ధం సభను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీగా నిర్వహిస్తోంది. ఇంత వరకు ఏ రాజకీయ పార్టీ చేయని స్థాయిలో సభ ఉండేలా ఏర్పాట్లు చేసింది. మొత్తం 110 ఎకరాల సభా ప్రాంగణాన్ని రెడీ చేసింది. రాయలసీయ జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు.
శనివారం సభా ప్రాంగణాన్ని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సభను ఎన్నికల సభగా నిర్వహిస్తున్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు సందేశమిస్తారు. రాబోయే ఎన్నికలకు పూర్తిగా నేతలు, కార్యకర్తలు సన్నద్ధమయ్యేలా కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ జగన్పై ఎంతో నమ్మకంతో ఉన్నారు. రాప్తాడు సభతో మొత్తం మూడు సిద్ధం సభలు పూర్తి అవుతాయి. 2024 ఎన్నికల్లో గెలిచిన 151 కంటే ఎక్కవ స్థానాలు గెలుస్తామని నమ్మకం ఉంది. ఇటీవల దెందులూరులో జరిగిన సభను ప్రతిపక్షాలు చూస్తే కోస్తా ప్రాంతంలో మా బలం తెలుస్తుంది. ప్రభుత్వ పనితీరే మా పార్టీ విజయానికి దోహదపడుతుంది. అమ్మఒడి, నాడు – నేడు, ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకాలు అమలు చేస్తున్నాం. ఎన్నికల్లో చెప్పుకొనేందుకు అనేక పథకాలను సీఎం జగన్ మాకు అందించారు. తెలుగుదేశం వారు మేము ఇది చేశామని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? లేదు కాబట్టే చంద్రబాబు తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈనెల 26వ తేదీన సీఎం జగన్ కుప్పం ప్రజలకు హంద్రీనీవా ద్వారా నీరు అందిస్తారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి బాబు ఆ పని చేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఎప్పుడో వైఎస్సార్సీపీలో చేరారు. అక్కడక్కడా మిగిలిన వారు చంద్రబాబు కోసం పని చేస్తున్నారు. రాజ్యసభలో ఒక్క ఎంపీ కూడా లేకపోవడం టీడీపీకి పెద్ద దెబ్బ. త్వరలో పల్నాడులో సిద్ధం సభను నిర్వహిస్తాం.