పాన్ ఇండియా సినిమాల పేరుతో దేశ వ్యాప్తంగా విడుదల అవుతున్న సినిమాల్లో, ముఖ్యంగా సౌత్ సినిమాల్లో యాక్షన్ మూవీస్ పేరుతో ఇవాళ జరుగుతున్నదేమిటో అందరికీ తెలుసు.
వెండి తెర నిండా హింస, రక్తం, అవయవాలు తెగి పడటం, తలలు పగలడం, ఇనుప చువ్వలు గుండెల్లో దించడం, బుల్లెట్ల్ వర్షం కురిసి శరీరాలను ఛిద్రం చేయడం, వందల కొద్దీ ప్రాణాలను చిదిమి వేయడం
సినిమాల్లో ఈ హింస హద్దులు మీరి జుగుప్సా కరంగా మారిపోయింది.
సైకాలజీ ఏమంటుందంటే, హింస కి కారణం కోపం, భయం వంటి నెగటివ్ ఎమోషన్స్ అని. అంటే ఎవరి మీదైనా కోపం రావడం, లేదా ఎవరైనా తననేదైనా చేస్తారేమో అనే భయంతో హింసకు పాల్పడటం.
అయితే మన సినిమా హీరోలను ఈ రెండు కారణాల కంటే తక్కువ కారణాలు కూడా ప్రేరేపించి, అత్యున్నత స్తాయి హింసకు పాల్పడేలా చేస్తుంటాయి.
హీరో విలన్ని తంతుంటే సగటు ప్రేక్షకుడు సంతోష పడతాడు. ఎందుకంటే చెడ్డవాడిని తన్నాలని తనకున్న కోరికను హీరో తెర మీద తీరుస్తున్నాడు. అందుకే హీరోతో ఐడెంటిఫై అయిన ప్రేక్షకుడు, విలన్ తన్నులు తింటుంటే తృప్తి అనుభవిస్తాడు.
అంతవరకు ఓకే. కానీ ఇవాళ మన హీరోలు విలన్ని, వాడి అనుచరుల్ని
నాలుగు తన్నులు తన్నడంతో ఆగటం లేదు, వాడి పేగులు తీసి మెళ్ళో వేసుకోవడం, గొడ్డళ్లతో నరికి ముక్కలు చేయడం వంటి వీవ్ర హింసకు పాల్పడుతున్నాడు. ఇటువంటి అసహజమైన పగ ప్రతీకారాలు సగటు ప్రేక్షకుడిలో ఉండవు
హీరోలు, దర్శకులు ఇటువంటి కథలు ఎందుకు ఎంచుకుంటున్నారు? ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల్లో హింస లేకుండా అసలు సినిమాయే లేదన్నట్టు తయారయింది పరిస్థితి. కెజిఎఫ్2 దర్శకుడు యష్ అంటాడు. “హింసకు నేననంటే ప్రాణం. దాన్ని తప్పించలేను నా సినిమాలో”
కోవిడ్ తర్వాత, సౌత్ ఇండియన్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో విడుదలై, నార్త్ లో కూడా బాక్సాఫీస్ బద్ధలు కొడుతున్నాయి. ఈ కలెక్షన్స్ మరింత పెంచాలనో ఏమో, హింస ని మరింతగా గ్లోరిఫై చేసి చూపించడం మన వాళ్లకి అలవాటై పోయింది.
కెజిఎఫ్, పుష్ప, తమిళ సినిమాలు బీస్ట్,వలీమై,నిన్న యానిమల్,ఇవాళ సలార్.. ఈ సినిమాల్లో కథ ఉన్నా లేక పోయినా, హింస మాత్రం సినిమా నిండా పరుచుకుని ఉంది.
నిర్మాతలు దర్శకులు మాత్రం పాత పాటే పాడుతున్నారు. “ప్రేక్షకులకు హింసాత్మక సినిమాలు నచ్చక పోతే థియేటర్లకెందుకు వస్తున్నారు? అందుకే మేము కూడా అవే తీస్తున్నాం” అంటూ. వీళ్ళంతా ఈ హింసని “యాక్షన్” అని పిలుస్తున్నారు ముద్దుగా
“ఈ హింస ప్రభావం సమాజం మీద ఎలా ఉంది?” అన్న ప్రశ్నకు వీళ్ళు” హింస సమాజంలో ఎప్పుడూ ఉంది. మేము సినిమాల్లో ఇపుడు చూపిస్తున్నామంతే” అని తప్పించుకుంటున్నారు గానీ, ఈ వయొలెన్స్ ప్రభావం టీనేజ్ మీద చాలానే ఉంది
పుష్ప సినిమాలో లాగా గాంగ్ స్టర్ కావాలని, ఢిల్లీ లో ఒక అమాయకుడిని ఇద్దరు యువకులు నిర్దాక్షిణ్యంగా చంపేశారు. పైగా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా అప్ లోడ్ చేశారు, ఫేమస్ కావాలని.
పుష్ప స్టైల్లో వాటర్ టాంక్ లో మద్యం బాటిళ్ళని స్మగుల్ చేశాడొక ప్రబుద్ధుడు. కెజిఎఫ్ స్టైల్లో సుత్తి తో కొట్టి 12 ఏళ్ళ తన కూతుర్ని హతమార్చాడొకడు. కర్ణాటకలో జెజిఎఫ్ నడుస్తున్న థియేటర్ లోనే ఒక ప్రేక్షకుడిని గన్ తో కాల్చి చంపేశాడు మరొక ప్రేక్షకుడు.
వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలీని ఉన్మాదాన్ని ఈ సినిమాలు రేకెత్తిస్తున్నాయన్నది నిజం కాదా? ఎవరు కాదన్నా అవునన్నా, యాక్షన్ మూవీస్ గా పిలుస్తున్న ఈ సినిమాలు వాస్తవానికి వంద మైళ్ళ దూరంలో ఉంటూ, నేర స్వభావం రేకెత్తించడానికి, నేరస్థులకు కొత్త కొత్త ఐడియాలు ఇవ్వడానికి దోహదం చేస్తున్నాయనేది కాదనలేని సత్యం.
నిర్మాత అయ్యప్ప ప్రసాద్ మాటల్లో “సౌత్ లో యాక్షన్ సినిమా చేస్తేనే గానీ సూపర్ స్టార్ హోదా రాదు. రొమాంటిక్ సినిమాలు చేసిన వాడు హీరో అనిపించుకోడు. పది మందిని చంపి వంద మందిని చితగ్గొడితేనే వాడు హీరో. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కూడా ఇలాగే తయారయ్యాడు.
“వయొలెన్స్ నిండిన సినిమాలని మల్టిప్లెక్స్ ప్రేక్షకులు ఆదరించరన్న బాలీవుడ్ నిర్మాతల అభిప్రాయాన్ని, సౌత్ సినిమాలు బద్దలు కొట్టాయి. హింసతో, యాక్షన్ తో నిండిన మాస్ సినిమాల్లోనే సౌత్ దర్శకులు, మంచి పాటల్ని, సెంటిమెంట్ ని నింపి, సొమ్ము చేసుకుంటున్నాయి” అని ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహతా అన్న మాట సత్య దూరం కాదు.
బాహుబలి, ట్రిపుల్ ఆర్ సినిమాల రచయిత విజయేంద్ర ప్రసాద్ “జనానికి నచ్చుతున్నాయా లేదా అన్నదే ప్రశ్న. ఇంకేదీ వర్కవుట్ కాదు” అని సమర్థించుకుంటున్నారు. పైగా సినిమాల్లో చూపించే హింస, కథ ప్రకారంగా సమంజసమే అంటున్నారాయన.
సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?
ఇన్ని సినిమాలు ఇంతంత హింస ను మోసుకుని తెచ్చి ప్రేక్షకుల ముందు గుమ్మరిస్తూ ఉంటే, దాని ప్రభావం సమాజం మీద, మనుషుల మెదళ్లలో రేకెత్తుతున్న హింసాత్మక ఆలోచనల మీద ప్రత్యక్షంగా కనిపిస్తుంటే,సెన్సార్ బోర్డ్ ఏం చేస్తున్నట్టు?
సెన్సార్ బోర్డ్ మాజీ సభ్యుడు ఒకరు ఇలా అంటున్నారు “హిందీ లోకి డబ్ అయే సౌత్ సినిమాల వల్ల బాలీవుడ్ ప్రేక్షకులకు క్రైమ్, వయొలెన్స్ అలవాటు అయ్యాయి. డబ్ చేసే నిర్మాతలు కూడా , సినిమాలో నాలుగైదు హింస ఉట్టిపడే ఫైటింగ్ సీన్లు ఉండాలని అడుగుతున్నారు. ఇవన్నీ బీ సీ సెంటర్లలో ఆడే సినిమాలు. సెన్సార్ బోర్డు కథ విషయంలో కలగజేసుకోక పోయినా ఇటువంటి కంటేంట్ విషయంలో అభ్యంతర పెట్టి తీరాలి. కానీ సిఫార్సులతో, రాజకీయ నాయకుల ఇంఫ్లుయెన్స్ తో అనర్హులైన వారు బోర్డు సభ్యులు గా ఎన్నిక అవుతూ ఉండటంతో వాళ్ళు ఇటువంటి సీన్లను చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. ఇది తప్పు ఇది రైటు అని చెప్పలేని
వ్ ఆరు బోర్డు సభ్యులు గా ఉండటంలో అర్థం లేదు”
సినిమాటోగ్రాఫ్ చట్టం 1952 ప్రకారం యాక్షన్ సినిమాలకు కొన్ని పరిమితులున్నాయి. “ఒక ఫైటింగ్ సీన్ నిడివి 3 నిమిషాల కంటే ఉండకూడదు” NCPCR చట్టం ప్రకారం, 12 ఏళ్ళ లోపు పిల్లల్ని ఫైటింగ్, లేదా హింస సీన్లలో నటింప జేయకూడదు. సెన్సార్ బోర్డు సభ్యులకు ఈ గైడ్ లైన్స్ ఏవీ తెలీక్ పోవడం వల్ల అన్ని సినిమాలూ బయటికి వచ్చేస్తున్నాయి.
“హీరో అయిన వాడు కనీసం 2 నుంచి 5 వేల మందిని చంపితే గానీ అది పాన్ ఇండియా సినిమా కాదు ఇవాళ. సామాజిక స్పృహ అనేది ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎన్ని కోట్లు సంపాదించినదనేదే ముఖ్యన్మ్” అని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అంటున్నారు
ఇవాళ ఈ యాక్షన్ సినిమాల రివ్యూ ఒక వాక్యంలో రాస్తే “ఫస్టాఫ్ అంతా నరకటం, సెకండాఫ్ అంతా కాల్పులు” ఇంతే
IPC section 302 ప్రకారం హత్య చేయడం నేరం. సెక్షన్ 306 ప్రకారం హత్యకు ప్రేరేపించడం కూడా నేరమే. ఈ హింసాత్మక సినిమాలు చేస్తున్నది ఇదే. హింసకు ప్రేరేపించడం