ఈనాడు జనవరి 21న పెద్ద అక్షరాలతో రాష్ట్రానికి జగన్ దెబ్బ అని కృష్ణ పట్నం పోర్ట్ లో ఒకే సంవత్సరంలో 5 మిలియన్ టన్నుల ఎగుమతులు తగ్గిపోయాయి అని రాశాడు.
అసలు అంతలా ఒకేసారి తగ్గే అవకాశం ఉందా.
ఒక రోజు ఏమో కృష్ణపట్నం లో ఎగుమతులు తగ్గాయి అని రాస్తారు. , మరోరోజు కృష్ణపట్నం పోర్టు ఆదాని తీసుకున్నాడు కాబట్టి రామాయపట్నం పోర్ట్ పనులు జరగలేదు అంటాడు , ఇందులో ఏది నిజం
వాస్తవ పరిస్థితి చూస్తే కృష్ణపట్నం పోర్టులో ఎగుమతులలో ఏడాది ఏడాదికి అభివృద్ది జరుగుతుంది. గణాంకాలు విషయానికి వస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో వార్షిక సరకు రవాణా – 3.81 కోట్ల టన్నులు ,2021-22 ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణా-4.01 కోట్ల టన్నులు ,2022-23 ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణా-4.82 కోట్ల టన్నులు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.78 కోట్ల టన్నులు ఎగుమతులు జరుగువచ్చు అని అంచనా , పైన లెక్కల ప్రకారం రవాణా పెరిగిందా తగ్గిందా. ఇందులో 6 లక్షల మిలియన్ టన్నులు రవాణా ఒక ఆర్థిక సంవత్సరంలో జరిగింది అని రాసావు . అసలా మార్క్ చేరుకోలేదే, ఇంక తగ్గేది ఎక్కడా, అంటే రాసేస్తే చూసేస్తారులే నిజాలు తెలుసుకోలేరు అనే నీ అభిప్రాయానికి కాలం చెల్లింది రామోజీ .
రాష్ట్రంలోని పోర్టుల్లో ఎగుమతుల్లో పెరుగుదల
2019-20-రూ.1,04,829 కోట్లు
2022-23-రూ.1,59,368 కోట్లు
2023-24(తొలి 6 నెలల్లో)-రూ.85,022 కోట్లు.పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతే ఏపీ పోర్టుల నుంచి సరుకు రవాణా నాలుగేళ్లలో రూ.54,539 కోట్లు అదనంగా ఎలా పెరిగింది.
ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఎగుమతులు తగ్గుతుంటే, మన రాష్ట్రం మాత్రం మొదటి ఆరు నెలల్లో 4.88 శాతం వృద్ధి తో ప్రస్తుతానికి 5వ స్థానంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరం 2022-23 లో 4.80 శాతంతో అరో స్థానంలో ఉన్నాము, ఇప్పటికే కాస్తా పురోగతిలో ఉన్నాము అయినా మన రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి అనే రాస్తారు మీ ఈనాడులో .
ఒకసారి రాసే ముందు రాయల్టీనైన చూడాలి కదా రామోజీ . 2020–21లో రాయల్టీగా రూ.46.06 కోట్లు వస్తే , 2021–22 లో రాయల్టీగా రూ.54.89 కోట్లు, 2022–23లో రాయల్టీగా రూ.72.22 కోట్లు, 2023–24లో అది రూ.88.91 కోట్లకు చేరుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రచారంలో కాకుండా నిజమైన అభివృద్ధితో ముందుకెళ్తోంది. పొరలు కమ్మిన రామోజీ కళ్ళకు మాత్రం అది కనపడదు.