సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిల ధర్మాసనం వెల్లడించింది. కాగా ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, రెండు వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను […]
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎరగా చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే అయినా స్టీఫెన్సన్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని చంద్రబాబు ప్రలోభ పెట్టారు. స్టీఫెన్సన్కు డబ్బు ఇవ్వడానికి వెళ్లిన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించినా అసలు కథ నడిపింది మాత్రం తెలుగుదేశం పార్టీ […]
చంద్రబాబు దగ్గర శిష్యరికం చేసిన ఎవరికీ ఆయనకున్నంతటి విజనరీ అబ్బలేదు అని అనుకునే సమయానికి దరిమిలా రేవంత్‌రెడ్డి సీయం అవడం, అయ్యాక ఆయనిస్తున్న స్టేట్మెంట్స్ చూడటంతో రాజకీయ జనానికి చాలా క్లారిటీ వచ్చింది. సేం టు సేం గురువులానే రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారు. సీయం సీటు అందుకున్న రెండో రోజే గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ముందుంచి ఇక మేం చేయగలం అని చెప్పినప్పుడే రేవంత్ తాను చంద్రబాబు అడుగుజాడల్లోనే నడవబోతున్నానన్న సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు […]
ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న వాలంటీర్ వ్యవస్థను తెలంగాణాలో అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 80 వేల మందిని రిక్రూట్ చేస్తూ టీఎస్ సర్కార్ ఇందిరమ్మ కమిటీలుగా నామకరణం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు అవినీతి, లంచాలు లాంటి బాధలు ధరిచేరకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ పారదర్శకంగా అమలువుతున్నాయంటే దానికి వాలంటీర్ వ్యవస్థ కూడా కారణం. ప్రభుత్వ సుపరిపాలన రాష్ట్రంలోని చిట్టచివరి ప్రాంతంలోని ప్రజలకి […]
రేవంత్ రెడ్డి అనే పేరు ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశం. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఒకే ఒక్క రాష్ట్రంలో ఆ పార్టీ అధ్యక్షుడు. తెలంగాణలో డెబ్బైకి పైగా నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన వ్యక్తి. కేసీఆర్ ని ఢీకొన్న ధైర్యవంతుడు. ఆరు నెలల ముందు వరకూ విజయానికి దరిదాపుల్లో కూడా లేని కాంగ్రెస్ పార్టీ విజయబావుటం ఎగరేయటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఇప్పుడు కాంగ్రెస్ 64 సీట్లు తెచ్చుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు […]
ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని సీనియర్ నాయకులను సంతృప్తి పరుస్తూ తెలంగాణ నూతన ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. డిసెంబర్ 7న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు. తెలంగాణాలో ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని […]