పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు పోస్టల్ బ్యాలెట్ పేపర్లు బదులు ఈవీఎం బ్యాలెట్ పేపర్లు ఇచ్చారు. ఈవీఎం బ్యాలెట్ పేపర్లలోనే ఉద్యోగులు తమ ఓటును వేశారు. పోలింగ్ అంత జరిగిన తర్వాత జరిగిన పొరపాటును అధికారులు గమనించారు. ఈ చర్య వల్ల 1219 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఉద్యోగుల ఫిర్యాదుతో మరోసారి పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని సీఈసీ ఆదేశించింది. దీంతో ఈ రోజు, రేపు చిలకలూరిపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించనున్నారు. […]
పల్నాడు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో చిలకలూరిపేట విలక్షణమైనది. 1983 నుండి 2014 రాష్ట్ర విభజన వరకు కూడా ఎప్పుడు ఆ నియోజకవర్గం రెండు సార్లు ఒకే పార్టీని గెలిపించిన చరిత్రలేదు. రాష్ట్ర విభజన తరువాత మాత్రమే మళ్ళీ 2014లో తిరిగి తెలుగుదేశం అభ్యర్ధిగా ఉన్న పత్తిపాటి పుల్లారావుని గెలిపించింది. అయితే ఆ ఎన్నిక అభ్యర్ధి పని తీరుపై కాకుండా రాష్ట్ర విభజన సెంటిమెంట్ పైనే జరిగింది కాబట్టి ఆ విజయాన్ని పేట వాసులు సీరియస్ గా […]
తమ్ముళ్లూ మీకు పుణ్యం ఉంటుంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు రండి.. మనం బలవంతులమని చూపించుకోవాలి’ ప్రస్తుతం తెలుగుదేశం పరిస్థితి ఇది. ఆదివారం ప్రజాగళం పేరుతో చిలకలూరిపేట మండలంలో సభ ఏర్పాటు చేశారు. దీనికి మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. ఎన్డీఏలో చేరాక పెడుతున్న తొలి సభ ఇది. దీనిని సక్సెస్ చేసి క్రెడిట్ కొట్టేసేందుకు నారా వారి పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. కమలం పెద్దల అండ ఇప్పుడు […]
టిడిపి జనసేన సీట్లు ప్రకటన తర్వాత మూడో సభను చిలుకలూరిపేటలో నిర్వహిస్తున్నట్లు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం టిడిపి కేంద్ర కార్యాలయంలో గురువారం జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేట సభలో టిడిపి జనసేన ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణ, మేనిఫెస్టోను చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని చెప్పారు. కాగా సీట్ల ప్రకటన తర్వాత తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా […]