రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా పై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్ చట్ట విరుద్ధమన్నారు. సీలు, హోదా(డిజిగ్నేషన్) లేకపోయినా ఫర్వాలేదని, స్పెసిమెన్ సిగ్నేచర్ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధ్రువీకరిస్తే సరిపోతుందని చెప్పడం, ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి […]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కింపు ప్రారంభం కానుంది, ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఈ క్రమంలో కౌంటింగ్ రోజున వివిధ పార్టీల ఏజెంట్లు సైతం కీలక పాత్ర పోషించనున్నారు. ఏజెంట్లకు నిబంధనలపై అవగాహన కలిగేలా ఆయా పార్టీ నేతలు సూచనలు చేస్తున్నారు ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో ఫారమ్–17సీ, ఫారమ్–17సీ పార్ట్–2 లు ఎంతో కీలకమైనవి, ప్రతి కౌంటింగ్ ఏజెంట్, పరిశీలకులు, సహాయ పరిశీలకులు దీనిపై […]
ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు చిట్టచివరి ప్రధాన అంశం. నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ పర్యవేక్షణలో, నియోజకవర్గ అభ్యర్ధి నియమించుకున్న ఏజెంట్ల సమక్షంలో జరుగుతాయి. చట్టం ప్రకారం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టవచ్చు. కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర: నియోజకవర్గ పార్టీ అభ్యర్ధి ప్రతినిధిగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్ చాలా కీలక పాత్ర పోషించడంతో పాటు, వారి సహకారంతో కౌంటింగ్ పర్యవేక్షకులు మరియు కౌంటింగ్ […]