ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టడానికి టీడీపీ చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టీడీపీ నాయకుల మీద పలు కేసులు నమోదయ్యాయి. స్వయంగా నారా భువనేశ్వరే మూడేసి లక్షల చొప్పున పంచడం, దానిపై కలెక్టర్ విచారణ చేపట్టడం మనకి తెలిసిందే. చీరాల ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మ దగ్గర యాభై ఆరు లక్షల నగదు పట్టుబడింది. ఎన్నికల కోడ్ ప్రకారం యాభై వేల రూపాయల కన్నా ఎక్కువ నగదు ఎవరి వద్దా […]
ఇరుకు వీధుల్లో కార్యక్రమాలు పెట్టడం.. తెలుగుదేశానికి జన స్పందన విపరీతంగా ఉందని చూపించడం ఆ పార్టీ నేతలు చాలాకాలంగా చేస్తున్న పని. గతం నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఎన్నికల సమయంలోనూ పాత విధానాన్నే అవలంభిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాల ప్రాంగణాల్లో సభలు పెడుతుంటే.. చంద్రబాబు నాయుడు మాత్రం ఇరుకు వీధుల్లో కార్యక్రమాలు పెట్టి.. నేతలు, కార్యకర్తల్ని తరలించి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొంతకాలం క్రితం చంద్రబాబు కందుకూరులో సభ పెట్టారు. పర్మిషన్ […]
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి గందరగోళంగా మారింది. తెలుగు తమ్ముళ్ల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. టీడీపీ, జనసేన నాయకుల మధ్య వివాదాలు ఆగడం లేదు.. జిల్లాల నుంచి రోజూ అధిష్టానానికి సమస్యలు వస్తూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో నాయకులు రచ్చకెక్కి పార్టీ పరువు తీస్తున్నారు. దీంతో చంద్రబాబుకు దిక్కుతోచడం లేదు. – తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఇటీవల ఫ్లెక్సీల లొల్లి జరిగింది. మాజీ మంత్రి జవహర్‌పై అచ్చిబాబు వర్గీయులు ఆగ్రహం […]