ఆంధ్రప్రదేశ్ లో తిరిగి రెండోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రాబోతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అభిప్రాయాన్ని మీడయా ప్రతినిధులతో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పోలింగ్ సరళితో పాటు ఏపీకి చెందిన వివిధ రాజకీయ పార్టీ నేతలతో మాట్లాడి తాను ఒక అంచనాకి వచ్చినట్టు వెల్లడించారు. తెలంగాణ భవన్ లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేసిన కేటీఆర్, తెలంగాణ రాజకీయాలపై స్పందించిన అనంతరం మీడియా ప్రతినిధులు ఏపీలో జరిగిన ఎన్నికల […]
సీఎం జగన్ కి ప్రజల్లో దక్కుతున్న ఆదరణను ఓర్వలేక ఆయనపై హత్య ప్రయత్నానికి పూనుకోవడం కలకలం రేపుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రను సీఎం జగన్ విజయవాడలో కొనసాగిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆయనను అడ్డు తొలగించుకోవడమే లక్ష్యంగా గుర్తు తెలియని ఆగంతకుడు సింగ్ నగర్ లోని వివేకానంద రెండో అంతస్తు నుండి దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కాగా సీఎం జగన్ యాత్ర కారణంగా కరెంటు వైర్లు తగులుతాయనే ఉద్దేశ్యంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిలాగే ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎప్పుడూ రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తుంటారు. కొంతకాలం క్రితం వరకు తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నారు. ఆయన్ను చూసి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చాలా నేర్చుకోవాలని ఆ రాష్ట్రంలో నివాసం ఉంటున్న, ఏపీలోని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. ప్రతి విషయంలో పోలిక తెచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద వేసేవారు. మరిప్పుడు అదే తమ్ముళ్ల స్వరం పూర్తిగా మారింది. […]