మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు అధికార వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా రాజోలు టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ కేటాయించకుండా టీడీపీ మొండిచెయ్యి చూపిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం గొల్లపల్లి సూర్యారావు పలు సంచలనమైన ఆరోపణలు చేశారు. టీడీపీలో నిబద్దతతో పనిచేశానని కానీ నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు […]
టీడీపీకి మరో సీనియర్ నేత గుడ్‌బై చెప్పారు. 2024లో ఏపీలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా టీడీపీ జనసేన ఉమ్మడిగా ప్రకటించిన జాబితాలో చోటు దక్కించుకోని సీనియర్లు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జనసేన- టీడీపీల్లో అసంతృప్తులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి గుడ్‌బై చెబుతూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. […]
చంద్రబాబును నమ్మితే రాజకీయాల్లో మనుగుడ ప్రశ్నార్థకమే అని మరో సీనియర్ నాయకుడికి అవగతమయ్యింది . రాజోలు నియోజక వర్గానికి చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ నిరాకరించడంతో వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవ్వడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాడు సూర్యారావు. 2004 లో ఎమ్మెల్యే గా గెలిచి వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పని చేశాడు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా గెలిచి 2019 సార్వత్రిక ఎన్నికలలోపోటీ చేసి ఓటమి చెందాడు. […]