రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మరింత తీవ్రం కానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది . గత నాలుగైదు రోజులగా కాస్త తగ్గుముఖం పట్టిన, నేటి నుంచి తన ప్రతాపం చూపడానికి సూర్యడు సిద్దమయ్యాడు. వారం క్రితం ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఎండలు కాస్త తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడా ఉపశమనం కలిగించేలా వర్షాలు పడినా , వాతావరణ శాఖ అంచనా వేసినట్లు రాష్ట్రం […]
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ప్రజలను బెంబేలిత్తుస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వేడిగాలులు వీస్తుండడంతో పాటు ఉక్కపోత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు, విజయవాడ, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. కర్నూలు 42, తిరుపతి 41, నెల్లూరు, విజయవాడలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా విశాఖ జిల్లాలో ఎండలు […]