అనగనగా ఓ సినిమా.. ఒకటేంటి చాలా వాటిల్లో ఇదే సీన్ ఉండొండొచ్చు. రెండు వర్గాల మధ్య గొడవలుంటాయి. ఒకసారి వాళ్లు కలుసుకున్నారు. లీడర్లు ఒకరిపై ఒకరికి అనుమానంతోనే కౌగలించుకున్నారు. ఇంతలో ఓ లీడర్‌పై కోడిగుడ్డో.. ఏదో ఒకటి పడింది. మీరే వేశారని వాళ్లు.. కాదు మీరే వేసుకుని మాపై నిందలు వేస్తున్నారని వీళ్లు.. నవ్వుకుంటూనే అనుకున్నారు. దెబ్బ తీసే అవకాశం కోసం ఎదురు చూడసాగారు. కొంచెం అటూఇటూగా ఇదే సంఘటన ఆంధ్రా ప్యారిస్‌లో జరిగింది.. బహుశా ఈ […]
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఎవరితో పూర్తి స్థాయిలో పొత్తులో ఉంటుందో ఇంకా చర్చల దశలోనే ఉంది. జనసేనతో కుదిరినా సీట్ల విషయం ఖరారు లేదు. బీజేపీ విషయం తెగలేదు. ఈ లెక్కన అధికారిక జాబితా ఇంకా తయారు కాలేదు. అయితే రాధాకృష్ణ పత్రిక ఆంధ్రజ్యోతి మాత్రం రోజూ తెలుగుదేశం అభ్యర్థులు వీరేనంటూ జాబితాలను ప్రకటిస్తోంది. ఆయన చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు. దీంతో ఇదే ఫైనల్ లిస్ట్ అని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు జనసైనికులు భగ్గుమంటున్నారు. […]