జూన్ 4న తారీఖున ఎన్నికల కౌంటింగ్‌ను సజావుగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్రాష్ట్రానికి సంబంధించిన 24 జిల్లాలకు 58 మంది పోలీసు అధికారులను నియమించినట్టు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా నిన్నటి రోజున ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 58 మంది పోలీసు అధికారులకు ఎన్నికల విధులు కేటాయిస్తునట్టు ప్రకటించారు.
పల్నాడును అత్యంత సమస్యాత్మకంగా పరిగణిస్తూ ఆ ఒక్క జిల్లాకు మాత్రమే ఎనిమిది మంది అధికారులని నియమించింట్టు, అలాగే బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడకు నలుగురు చొప్పున, గుంటూరు, కృష్ణా, అనంతపురం, ప్రకాశం, తిరుపతిలకు ఒక్కొక్కరు చొప్పున డీజీపీని కేటాయించారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతల నియంత్రణలో ప్రత్యేక అధికారులు కీలక పాత్ర పోషిస్తారని, ఏదైనా అవాంఛనీయ ఘటనలు సంభవిస్తే వెంటనే సంబంధిత ఎస్పీలు, కమీషనర్లకు రిపోర్టు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఏపీలోని పల్నాడు జిల్లాతో సహా అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన విషయం తెలిసిందే.