గత కొన్నేళ్లుగా మంచు విష్ణుకు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణ పరాభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. చివరి హిట్ చిత్రంగా నిలిచిన ఆడో రకం ఈడో రకం చిత్రం వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు కావస్తోంది. ఈ ఎనిమిదేళ్లలో ఎంత ప్రయత్నం చేసినా హిట్ మాత్రం విష్ణుకు అందని ద్రాక్షగా మిగిలింది. దీంతో కన్నప్పతో మంచు తనను విష్ణు తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు మోహన్ లాల్, బాలీవుడ్ […]