ఏప్రిల్ 13వ తేదీ విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ సమీపంలో సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆగంతకుడు జగన్ పై రాయి విసరగా ఆయన ఎడమ కన్ను పైభాగంలో తగిలి గాయమైంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సతీష్‌ను విజయవాడ కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది. ముఖ్యమంత్రి జగన్ […]