తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నీతి, నిజాయితీ లేని వ్యక్తి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముస్లిం, మైనార్టీల ఉనికిని దెబ్బ కొట్టి వారి భవిష్యత్‌ను అంధకారం చేసే సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) రూల్స్ నోటిఫై చేసి ప్రమాదంలోకి నెట్టిన బీజేపీ కుతంత్రాలపై రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలకు ఆత్మగౌవరం లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్రాన్ని […]