వైఎస్సార్ కాంగ్రెస్లో వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతల చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర చిత్తూరు జిల్లాకు చేరగా చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల వారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేత కండువాలు కప్పించుకున్నారు. ఇందులో ముఖ్యమైన వ్యక్తి ఆ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు రావూరి ఈశ్వరరావు. ఈయన చాలాకాలం తెలుగుదేశంలో ఉన్నారు. పార్టీ అభివృద్ధి కోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. ప్రజల కోసం విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. […]