నెల్లూరు జిల్లా కోవూరు తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కుటుంబానికి అటు చంద్రబాబు నాయుడు, ఇటు వేమిరెడ్డి ప్రభార్రెడ్డి (వీపీఆర్) వెన్నుపోటు రుచి చూపించారు. దీంతో పోలంరెడ్డి దిక్కుతోచని స్థితికి వెళ్లిపోయారు. శ్రీనివాసులురెడ్డి 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. గతంలో ఓసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. కోవూరు సీనియర్ నేతగా ఉన్నారు. 2019లో ఓడిపోయినా పార్టీకి దూరం కాలేదు. కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో వయసు రీత్యా […]