విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో నిర్మాణంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు రాష్ట్ర ప్రభుత్వం అంచనాల మేరకు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్‌రెడ్డి సోమవారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలించి, జరుగుతున్న పనుల అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ 2025 నాటికి పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తునట్టు, అనుకున్న విధంగానే ఇప్పటికి 25% పని పూర్తయిందని ప్రాజెక్ట్ ఇంజనీర్లు జవహర్‌రెడ్డికి […]