ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉనికి నిలబెట్టుకోవడం కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలను కాంగ్రెస్ అధినాయకత్వం ఎంపిక చేయనుందని రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసారు. నిన్న మణిపూర్ లో భారత్ జోడో న్యాయ్ యాత్రను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ షర్మిల కూడా హాజరయ్యారు. […]