దర్శి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా గొట్టిపాటి నరసయ్య కూతురు గొట్టిపాటి లక్ష్మీకి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. తనకు టికెట్ కేటాయించిన తరువాత సొంత నియోజకవర్గం అద్దంకి నుండి తన అన్న గొట్టిపాటి రవి అండ దండలతో సొంత అభిమానుల మధ్య దర్శిలో అడుగుపెట్టిన గొట్టిపాటి లక్ష్మీకి ఘన స్వాగతం పలికారు. ఆరోజు జరిగిన స్వాగత సత్కారాలు, కార్యక్రమాలు చూసిన దర్శి టీడీపీ నాయకులు ఆశ్చర్యపొయ్యారు. గొట్టిపాటి లక్ష్మీ నరసరవుపేటలో గైనకాలజిస్టుగా పని చేస్తూ తన అన్న […]